Nov 4, 2019

Mushrooms may help you fight off aging

పుట్టగొడుగులతో వృద్ధాప్యం దూరం

ఆరోగ్య పరిరక్షణలో పుట్టగొడుగులు (మష్రూమ్స్‌) ఎంతగానో ఉపయోగపడతాయన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే... ఇవి వృద్ధాప్యాన్ని కూడా దూరం చేస్తాయన్న సంగతి మాత్రం మనలో చాలామందికి తెలియదు.

ఆరోగ్య పరిరక్షణలో పుట్టగొడుగులు ఎంతగానో ఉపయోగపడతాయన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే... ఇవి వృద్ధాప్యాన్ని కూడా దూరం చేస్తాయన్న సంగతి మాత్రం మనలో చాలామందికి తెలియదు. పుట్టగొడుగుల్లో అధికంగా ఉండే 'ఎర్గోథియోనిన్', 'గ్లుటాథియోన్' అనే యాంటీ ఆక్సిడెంట్లు ఇందుకు ప్రధానం కారణం. ఇతర ఉడికించిన కూరగాయల మాదిరిగా పుట్టగొడుగులను ఉడికించినప్పటికీ... వాటిల్లోని యాంటీ ఆక్సీడెంట్ల శాతం ఏమాత్రం మారదు.

Mushrooms may help you fight off aging
Mushrooms may help you fight off aging

మనం తీసుకున్న ఆహారం ఆక్సీకరణకు గురైనప్పుడు హానికారక 'ఫ్రీరాడికల్స్' శరీరంలోకి విడుదలవుతాయి. ఇవి శరీర కణాలను దెబ్బతీస్తాయి. ఫలితంగా క్యాన్సర్, గుండె సంబంధ సమస్యలు, అల్జీమర్స్ వంటి వ్యాధులు సంభవిస్తాయి. చివరకు డీఎన్‌ఏపై కూడా ఇవి ప్రభావం చూపి, వృద్ధాప్యానికి కారణమవుతున్నాయి. అయితే పుట్టగొడుగుల్లో అధికంగా ఉండే 'ఎర్గోథియోనిన్', 'గ్లుటాథియోన్' యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి ఫ్రీరాడికల్స్ ఎక్కువ విడుదల కాకుండా చేస్తాయి.

పుట్టగొడుగుల్లో ఉండే యాంటీ ఆక్సీడెంట్లకు నాడీవ్యాధులను అడ్డుకునే లక్షణం ఉంటుంది. కాబట్టి, నరాల వ్యాధులతో బాధపడేవారు ఆహారంలో రోజూ... ఐదు పుట్టగొడుగులు తీసుకోవడం మంచిది.

Subscribe to get more Images :