Nov 4, 2019

Nitheen Kumar

Major Healthy Benefits of drinking Tulsi tea

తులసి టీ తాగటం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

ఔషద గుణాలను కలిగి ఉండే తులసి చెట్టును మనం ఎంత పవిత్రంగా కోలుచుకుంటామో తెలిసిందే. మరి తులసి ఆకుల నుండి తయారు చేసినటీ తాగటం వలన కలిగే ప్రయోజనాల గురించి మీరే తెలుసుకోండి మరి!

జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది

అజీర్ణం, మలబద్దకం వంటి ఇతరేతర జీర్ణ సమస్యలు కలిగి ఉన్నారా? అయితే తులసి టీ వీటిని తగ్గించే అద్భుత ఔషదంగా పేర్కొనవచ్చు. యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉండే తులసి టీ దాదపు అన్ని రాకల జీర్ణక్రియ సమస్యలను తగ్గిస్తుంది.

Major Healthy Benefits of drinking Tulsi tea

తులసి

ఔషద గుణాలను కలిగి ఉన్నందు వలన తులసిని పురాతన కాలం నుండే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. వీటి వలన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనలా కారణంగా తులసిని ఆయుర్వేద ఔషదాల తయారీలో విరివిగా వాడుతున్నారు. మరి అలాంటి తులసి టీ తాగటం వలన మనకు కలిగే ప్రయోజనాల గురించి ఇక్కడ వివరించబడింది.

వృద్దాప్య మార్పులను ఆలస్యపరుస్తుంది

కొద్ది కాలం పాటూ రోజు తులసి టీ తాగటం వలన వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లు చర్మంలో ఉండే నిర్జీవ కణాలను తొలగించి, నూతన కణాలను పునరుత్పత్తికి తోడ్పడతాయి. కావున యవ్వన చర్మం పొందుటకు తప్పక రోజు తులసి టీ తాగటం తప్పదు మరి.

మూత్రపిండాలలో రాళ్లు

తులసి టీ శరీరాన్ని డిటాక్సిఫై గురి చేస్తుంది కావున మూత్రపిండాలలో రాళ్లు కలిగిన వారు ఈ టీని తాగవచ్చు. రోజు ఈ టీని తాగటం వలన కిడ్నీ స్టోన్స్ త్వరగా కరిగిపోయే అవకాశం ఉంది.

రక్తంలోని చక్కెర స్థాయిలో నియంత్రణ

మధుమేహ వ్యాధి గ్రస్తులు తులసి టీ చాలా సహాయపడుతుంది. ఎందుకంటే వీటిలో ఉండే అన్-సాచురేటేడ్ ఫాటీ ఆసిడ్ లు రక్తంలో ఉండే అధిక చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి. కావున బ్లడ్ షుగర్ లెవల్స్ అధికంగా గల వారు రోజుకు ఒకసారి ఈ టీ తాగటం చాలా మంచిది.


Subscribe to get more Posts :