టోకోఫోబియా అంటేఏంటి ఎట్లొస్తది ఎట్లపోతది
Tokophobia Symptoms for Childbirth Fear In Telugu
ఆడవాళ్లకు మాతృత్వం ఒక మధురమైన అనుభూతి. ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పటి నుంచే పుట్టబోయే బిడ్డ గురించి ఎన్నో ఆలోచనలు చేస్తుంటారు. ఒకవైపు కుటుంబంలో కొత్తగా ఒక మెంబర్ రాబోతున్నారనే ఆనందం ఉంటుంది. మరోవైపు ఆ కపుల్ మధ్య బాండింగ్ కూడా బలపడుతుంది. అయితే కొందరు ఆడవాళ్లలో ప్రెగ్నెన్సీ అంటే ఎక్కడ లేని భయం ఉంటుంది. మెడికల్ టెర్మినాలజీలో ఈ భయాన్ని ‘టోకోఫోబియా’అంటారు. డాక్టర్లు ఇది సైకలాజికల్ ప్రాబ్లమ్ మాత్రమే అని చెప్తున్నారు.
టోకోఫోబియా గ్రీకు పదాల నుంచి పుట్టింది. టోకోస్ అంటే బిడ్డకు జన్మనివ్వడం, ఫోబోస్ అంటే భయాలు.
మనుషుల్లో భయాలు(ఫోబియాలు) కామన్. కానీ, టోకోఫోబియా అలా కాదు. మెడికల్ లిటరేచర్‌లో వందల ఏళ్ల క్రితమే ఈ ఫోబియా గురించి ప్రస్తావించారు. ఈ ఫోబియా ఉన్నవాళ్లు పిల్లల్ని కనాలంటే భయపడతారు. అందుకు కారణం ‘ప్రెగ్నెన్సీ, డెలివరీ’ గురించి వాళ్లలో ఉండే అపోహ. ప్రెగ్నెన్సీ టైంలో ప్రెజర్ తప్పదని, డెలివరీ టైంలో ఏమవుతుందోనని భయపడ్తుంటారు. ముఖ్యంగా యాంగ్జైటీ డిజార్డర్ ఉన్న ఆడవాళ్లలో ఈ ఫోబియా ఎక్కువగా ప్రభావం చూపెడుతుంది. సగటున ప్రతి వంద మంది ఆడవాళ్లలో 14 మందికి ఈ సమస్య ఉందని డబ్ల్యూహెచ్‌వో నివేదిక చెబుతోంది.
రీజన్లు ఏంటంటే
టోకోఫోబియా మానసిక స్థితికి సంబంధించిన ఒక సమస్య. ఈ ఫోబియా ఆడవాళ్లలో ప్రెగ్నెన్సీ పట్ల ఆసక్తి లేకుండా చేస్తుంది. సాధారణంగా ఇందులో రకరకాల కేసులు కనిపిస్తుంటాయి. మొదటిది.. ప్రెగ్నెన్సీ అనుభవం లేని వాళ్లకు కలిగే భయం. కొత్తగా పెళ్లైన ఆడవాళ్లు ప్రెగ్నెన్సీ, డెలివరీ గురించి రకరకాల కథలు విని ఉండొచ్చు. లేదంటే బిడ్డ పుడితే ప్రేమగా చూసుకునే పార్టనర్ దూరమవుతాడేమోనని భయపడుతుండొచ్చు. ఈ కారణాలతో భర్తలను కూడా దగ్గరకి రానివ్వరు. ‘నా గర్భంలో ఒక ప్రాణి పెరగడం నాకిష్టం లేదు. ఆ కదలికలు కూడా నాకు భయాన్ని కలిగిస్తాయ’ని చెప్తుంటారు ఈ ఫోబియా ఉన్నవాళ్లు.
రెండవది.. ఆల్రెడీ ప్రెగ్నెన్సీ అనుభవం ఉన్నవాళ్లు. ఈ కేసుల్లో ఫోబియా ఉన్నవాళ్లకి యాంగ్జైటీ సమస్య ఎక్కువ. మెజార్టీ కేసుల్లో అబార్షన్ బాధితులే ఉంటారు. మరోసారి అలాంటి ఇన్సిడెంట్ జరుగుతుందని భయపడుతుంటారు. అయితే డెలివరీ టైం దగ్గర పడేకొద్దీ ఆందోళన ఇంకా ఎక్కువ అవుతుంది. ఒక్కోసారి డిప్రెషన్‌లోకి వెళ్లే చాన్స్ ఉంది. అప్పుడు బిడ్డ ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని చెప్తున్నారు డాక్టర్లు. ఇంకొందరిలో పురిటి నొప్పుల గురించి ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. కాబట్టి, ఆ భయంతో సిజేరియన్‌కి ఆసక్తి చూపిస్తుంటారు.
ఇలాంటి భయాలున్నాయి
నెగెటివ్ ఆలోచనలు కూడా ప్రెగ్నెన్సీ పట్ల భయాన్ని కలిగిస్తాయని చెప్తోంది ఎఫ్‌ఎంఆర్‌ఐ(గుర్‌గావ్) హెడ్, ప్రముఖ గైనకాలజిస్ట్ సునీత మిట్టల్. ‘ ఒక్కోసారి పురిటి నొప్పుల గురించి బంధువులు, దగ్గరి వాళ్లు తమ అనుభవాల్ని చెప్తారు. అది విని వాళ్లలో భయం కలుగుతుంది. లేదంటే వాళ్లు లైంగిక దాడి బాధితులు అయి ఉండొచ్చు. ఇంకొందరు బిడ్డ పుడితే లైఫ్ స్టైల్ మారిపోతుందని, ఫిజికల్ బ్యూటీ దెబ్బతింటుందని భయపడతారు. ఎక్కువ కాలం పిల్లలు పుట్టకపోవడం, వైవాహిక జీవితంలో కలతలు, సోషల్ సపోర్ట్ తక్కువగా ఉండటం.. ప్రెగ్నెన్సీ పట్ల ఆసక్తిని లేకుండా చేసే ఇతర కారణాలు’ అంటోంది సునీత. అయితే ఈ ఫోబియా ఉన్నవాళ్లకు ‘స్మోకింగ్’ అనేది ఇంకా రిస్క్ ఫ్యాక్టర్‌గా మారుతుందని హెచ్చరిస్తున్నారామె. టోకోఫోబియా ట్రీట్‌మెంట్ కంటే ముందు.. ఆ మహిళకు ఇంకా ఏమైనా మానసిక సమస్యలు ఉండవచ్చు. ముందు ఆ సమస్యలకు ట్రీట్‌మెంట్ చేయించి.. ఆ తర్వాతే టోకోఫోబియా ట్రీట్‌మెంట్ ఇప్పించాలని ఆమె సూచిస్తోంది.
సోషల్ సపోర్ట్
టోకోఫోబియా ఉన్నవాళ్లకు ఫ్యామిలీ సపోర్ట్ చాలా అవసరం. పేరెంట్స్, స్నేహితులు, బంధువులు.. అంతా ధైర్యం చెప్పాలి. వాళ్లలోని ఒత్తిడిని దూరం చేయాలి. ముఖ్యంగా ఇలాంటి సిచ్యుయేషన్‌లో భర్త సపోర్ట్ చాలా అవసరం. ప్రెగ్నెన్సీ, డెలివరీ గురించి వాళ్లలో పాజిటివిజం పెంచాలి. ఆందోళన తగ్గించి మానసిక స్థైర్యం అందించాలి. పరిస్థితి తీవ్రమైతే కౌన్సెలింగ్ కోసం డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్లాలి. టోకోఫోబియా గురించి అవగాహన కల్పించేందుకు సోషల్ మీడియాలో కొన్ని గ్రూపులు ఉన్నాయి. సెమినార్లు, ఫ్రీ కౌన్సెలింగ్ ద్వారా సోషల్ సపోర్ట్ ఇస్తూ టోకోఫోబియాను దూరం చేసే ప్రయత్నం చేస్తున్నాయవి.

Tokophobia Symptoms for Childbirth Fear In Telugu |

0 Comments