Oct 13, 2019

Health Benefits of Pears Fruit for Diabetes

పియర్​​ పండ్లతో డయాబెటిస్​ తగించుకోవచ్చు ​
Control your diabetes by eating pear fruit

ఇప్పుడు రోడ్ల పక్కన ఎక్కడ చూసినా… ఆకుపచ్చ రంగులో యాపిల్​ పండ్లను పోలిన పండ్లే కనిపిస్తున్నాయి. ఒకప్పటి కంటే ఇప్పుడు ఆ పండ్లు విరివిగా దొరుకుతున్నాయి. అవే ‘పియర్​’ పండ్లు. తక్కువ తీపితో రుచిగా ఉండే పియర్​ పండ్లను తింటే… బరువు తగ్గడమే కాదు, టైప్– 2 డయాబెటిస్, గుండె జబ్బులు కూడా తగ్గుతాయట. వాటిలో ఉండే ఫైబర్ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.178 గ్రాముల పియర్​ పండులో 101 క్యాలరీలతోపాటు 27 గ్రాముల కార్బోహైడ్రేట్స్ ఉంటాయి.

Benefits of Pears Fruit for Diabetes
Benefits of Pears Fruit for Diabetes

యాపిల్ పండులాగే… చక్కటి రుచితో పాటు ఆరోగ్యాన్నీ అందిస్తాయి పియర్​ పండ్లు. ఎవరైనా వీటిని తినొచ్చు. అందుకే వీటిని సూపర్ ఫుడ్‌‌గా పిలుస్తారు. పియర్స్‌‌లో క్యాల్షియం, ఫొలేట్​, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్​ C, E, K ఉంటాయి. అలాగే బీటా-కెరోటిన్, ల్యూటెయిన్, రెటినాల్ కూడా ఉంటాయి. ఇవన్నీ ఆరోగ్యానికి మేలు చేసేవే. రెగ్యులర్‌‌గా పియర్స్ తినడం వల్ల బరువు తగ్గుతున్నట్లు, టైప్– 2 డయాబెటిస్, గుండె జబ్బుల వంటివి నయమవుతున్నట్లు పరిశోధనల్లో తేలింది.

డయాబెటిస్​కి చెక్​

డయాబెటిస్​ ఉన్న వాళ్లు అన్ని రకాల పండ్లు తినకూడదు. కానీ పియర్స్ మాత్రం తక్కువ కార్బోహైడ్రేట్స్‌‌, తక్కువ క్యాలరీలు, ఎక్కువ ఫైబర్ (పీచు పదార్థం)తో అందరూ తినేందుకు వీలవుతుంది. పైగా ఇందులో మన శరీరంలో విషవ్యర్థాల్ని తొలగించే యాంటీ ఆక్సిడెంట్స్, ఫ్లేవనాయిడ్స్ కూడా ఉంటాయి. డయాబెటిస్​ ఉన్నవాళ్లలో ఒకవేళ హై బ్లడ్ షుగర్ లెవెల్స్‌‌ని నార్మల్‌‌కి తీసుకురాలేకపోతే, అవి తీవ్ర అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. రెగ్యులర్ ట్రీట్‌‌మెంట్, సరైన ఆహారం, ఎక్సర్‌‌సైజ్ వంటివి చేస్తుంటే, అధిక బరువు తగ్గడమే కాకుండా… షుగర్ లెవెల్స్ కంట్రోల్‌‌లో ఉంటాయి. పియర్స్‌‌లో ఉండే ఫైబర్ వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అలా బాడీ వెయిట్​ కంట్రోల్లో ఉంటుంది.

బరువు తగ్గిస్తుంది

పియర్స్‌‌లో ఎక్కువ భాగం నీళ్లు, పీచు మాత్రమే ఉంటుంది. అందువల్ల ఈ పండ్లను తింటే… పొట్ట నిండిపోయిన ఫీలింగ్​ కలుగుతుంది. దాంతో వేరే ఆహార పదార్థాలు తినలేరు. ఫలితంగా బరువు పెరిగే ప్రమాదం తప్పుతుంది.  ఈ పండ్లలోని పెక్టిన్ అనే పదార్థం… పియర్స్‌‌ను త్వరగా జీర్ణం కాకుండా చేస్తుంది. ఇటీవల జరిగిన సర్వే ప్రకారం… రోజుకు రెండు పియర్స్ తినేవాళ్లకు నడుం చుట్టూ ఉండే కొవ్వు తగ్గి… నడుం సైజ్1.1 ఇంచులు (2.7 సెంటీమీటర్లు) తగ్గిందట.

జాగ్రత్తలు

టేస్ట్ బాగున్నాయి కదా అని పియర్స్ పండ్లను మరీ ఎక్కువగా తినకూడదు. రోజుకు రెండు కంటే ఎక్కువ పండ్లను తింటే… కడుపులో గ్యాస్, ఉబ్బరం, కడుపు నొప్పి, విరేచనాలు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.


Subscribe to get more Images :