Mar 13, 2024

Amazing Benefits of Neem Oil for Beautiful Face

అందం సంరక్షణ కోసం వేప నూనె

ప్రతి ఒక్కరూ అందంగా ఆరోగ్యంగా ఉండాలనే కోరుకుంటారు. అందం మరియు ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి వ్యక్తిగత సంరక్షణ చాలా అవసరం. రోజువారీ సంరక్షణ అనగానే మనకు తోచే మొదటి విషయం ఆయుర్వేదం. మన భారతదేశం ఆయుర్వేదం లో ఎంతో ప్రఖ్యాతి చెందిన దేశం. ఎన్నో మూలికలు లభించే దేశమిది. ప్రతి చెట్టు, వాటి యొక్క ఆకులూ మరియు కొమ్మల్లో ఉండే ఔషధ గుణాలు తెలిసిన వాళ్ళు ఎందరో ఉండే వారు. ఇంగ్లీష్ మందులు సులభంగా లభించటం వలన కాలం మారే కొద్ది ఆయుర్వేదం యొక్క ప్రాముఖ్యత తగ్గిపోయింది. కానీ అటువంటి పరిస్థితులు మారి ప్రస్తుత జనరేషన్ లోని యువతీ యువకులు మన ప్రాచీన పద్ధతులను అనుసరించటం మల్లీ మొదలు పెట్టారు.

Amazing Benefits of Neem Oil for Beautiful Face
Amazing Benefits of Neem Oil for Beautiful Face

మన ఆయుర్వేదంలో ఆరోగ్యం కొరకు అలాగే సౌందర్యం కొరకు ప్రసిద్ధి చెందిన మూలికల్లో ఒకటి ‘వేప’. అమ్మమ్మలు తాతయ్యలు ఉన్న కాలంలో వేప చెట్టు లేని వీధి ఉండేది కాదు. ప్రస్తుత కాలంలో కూడా ఎన్నో గ్రామాలలో వీధికి కనీసం ఒక వేప చెట్టుని చూస్తూనే ఉంటాము. మన తెలుగు సంప్రదాయంలో వేపాకు చెట్టు అనగానే గుర్తొచ్చేది ఉగాది. ఉగాది పచ్చడి చేసేందుకు వేప పూలను ఉపయోగిస్తాం. మన పూర్వీకులు వేప పూలనే కాదు వేప ఆకులూ మరియు చిన్న చిన్న వేప కాడలను కూడా ఉపయోగించేవారు. వీటిని ఉపయోగించటం వలన ఎంతో ధృఢంగా ఆరోగ్యంగా మరియు అందంగా ఉండేవారు. వేపాకులను ఇన్ఫెక్షన్, అమ్మోరు వంటి అనేక వైద్యాలకు ఉపయోగిస్తారన్న విషయం మన అందరికీ తెలిసిందే. వేప నుండి తయారు చేసిన నూనె ప్రస్తుతం మార్కెట్ లో లభిస్తోంది. మరి మన ఆరోగ్యం మరియు అందం యొక్క సంరక్షణ కొరకు వేప చమురు ఎలా ఉపయోగపడుతుందో ఈ వ్యాసం లో వివరంగా తెలుసుకుందాం.

బ్లాక్ హెడ్స్ తొలగించేందుకు : 

వేప నూనె ని రెగ్యులర్ గా ఉపయోగిస్తే బ్లాక్ హెడ్స్ మరియు వైట్ హెడ్స్ ను తొలగించి, తిరిగి రాకుండా ఉండేందుకు సహాయపడుతుంది.

కొంత నీటిలో కొన్ని చుక్కల వేప నూనె ని కలిపి డైల్యూట్ చేసుకోవాలి. మృదువైన చర్మం పొందేందుకు రోజుకు ఒకసారి బ్లాక్ హెడ్స్ మరియు వైట్ హెడ్స్ పై రాయండి.

వేప నూనె తో మొటిమలు తగ్గించండి : 

వేప నూనె లో ఫ్యాటీ ఆసిడ్స్ మరియు ఆస్పిరిన్ సమ్మేళనాలు ఉంటాయి. అవి మొటిమలను తగ్గించడానికి సహాయపడతాయి.

మీ ముఖాన్ని బాగా శుభ్రం చేసుకొని కొన్ని చుక్కల వేప నూనెని మీ ముఖంపై దరఖాస్తు చేసుకోండి. మొటిమలను తగ్గించడానికి రోజుకు రెండు సార్లు రాసుకోవచ్చు.

హైపర్-పిగ్మెంటేషన్ ని తగ్గించేందుకు వేప నూనె : 

చర్మంలో నలుపు రంగును ఉత్పత్తి చేసే మెలనిన్ యొక్క ఉత్పత్తిని వేప నూనె ఆపుతుంది. తద్వారా హైపర్-పిగ్మెంటేషన్ ని తొలగిస్తుంది.

ముఖాన్ని శుభ్రం చేసుకుని వేప నూనెని క్రమం తప్పకుండా రాయటం వలన హైపర్-పిగ్మెంటేషన్ పై మెరుగైన ప్రభావం చూపుతుంది.

ముడతలను వదిలించుకోడానికి వేప : 

చర్మం పై ఏర్పడే ముడతలను తొలగించటానికి వేప నూనె సహాయ పడుతుంది. ఇది చర్మం యొక్క రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.

ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు వేప నూనెని ముడతలపై రాయటం మర్చిపోకండి.

యాంటీ ఏజింగ్ సీరం : 

చర్మం యొక్క సౌందర్యాన్ని కాపాడి మడతలు మొదలైన ఏజింగ్ లక్షణాలను తగ్గించేందుకు అవసరమైన సమ్మేళనాలు వేప నూనె లో ఉంటాయి.

మీరు ఉత్తమ ఫలితాన్ని పొందేందుకు ప్రతి రోజు వేప నూనెని నైట్ క్రీం వలే ఉపయోగించండి.

Subscribe to get more Images :