Breaking

Tollywood Bollywood Hollywood Kollywood Indian Models Actors Actress Latest Photo Shoot Stills Photos Pictures Movie Posters Gallery Pics Wallpapers Movies List

Ads

30 August 2019

Who is Dr Khader Vali Millet Man Food Health Tips

ఎవరీ డా.ఖాదర్‌వలి?

Who is Dr Khader Vali Millet Man Food Health Tips

కడప జిల్లా ప్రొద్దుటూరులో జన్మించిన డాక్టర్‌ ఖాదర్‌ వలి (60) సిరిధాన్యాల పునరుద్ధరణకు 20 ఏళ్లుగా శ్రమిస్తున్నారు.  మైసూరులో ఎమ్మెస్సీ (ఎడ్యుకేషన్‌) చదివిన తర్వాత బెంగళూరులో స్టెరాయిడ్స్‌పై పీహెచ్‌డీ చేశారు. సహ విద్యార్థిని ఉషను ప్రేమించి పెళ్లాడారు. అమెరికా వెళ్లి బీవెర్టాన్‌ ఓరెగాన్‌లో పర్యావరణ శాస్త్రంపై పోస్ట్‌ డాక్టోరల్‌ ఫెలోగా ఉన్నారు.  ఏజెంట్‌ ఆరెంజ్, డయాక్సిన్లు వంటి అత్యంత విషతుల్య రసాయనాలను నిర్వీర్యం చేయటంపై పరిశోధన చేశారు.

ఆహారం వాణిజ్యకరించబడుతున్న నేపథ్యంలో తాను పరాయి దేశంలో ఉద్యోగం చేయటం కన్నా స్వదేశంలో ఆరోగ్యవంతమైన సమాజం కోసం కృషి చేయటమే జీవితానికి అర్థవంతంగా ఉంటుందని భావించి 1997లో భారత్‌కు తిరిగి వచ్చి మైసూరులో స్థిరపడ్డారు.
Who is Dr Khader Vali Millet Man Food Health Tips
Who is Dr Khader Vali Millet Man Food Health Tips

అంతరించిపోతున్న 5 రకాల చిరుధాన్యాల పునరుద్ధరణకు కృషి చేశారు. వీటిని వాడే క్రమంలో ప్రతి ఒక్క చిరుధాన్యానికి ఉన్న ఔషధ గుణాల వల్ల భయంకరమైన జబ్బులు సైతం తగ్గుతున్నాయని కనుగొన్నారు. అందుకే వీటికి సిరిధాన్యాలని పేరు పెట్టారు. వీటిని సహజ పద్ధతుల్లో సాగు చేయడానికి ‘కాడు కృషి’ అనే విధానాన్ని ఆవిష్కరించారు.

తన వద్దకు వచ్చే రోగులకు సిరిధాన్యాలు, కషాయాలతోను.. మరీ అవసరమైనప్పుడు హోమియో మందులనూ అందిస్తున్నారు. వరి బియ్యం, గోధుమలు, పాలు, మాంసాహారం, వేళా పాళాలేని ఆహార విహారాలు, జన్యుమార్పిడి పంటలు, రసాయనిక ఎరువులు, పురుగుమందులు, కలుపుమందులు పర్యావరణాన్ని, ఆహారాన్నీ విషతుల్యంగా మార్చి ప్రాణాంతక వ్యాధులు అత్యంత వేగంగా ప్రబలడానికి కారణభూతమవుతున్నాయని ఆయన భావిస్తున్నారు.

మధుమేహం, అధిక రక్తపోటు, ఊబకాయం, మలబద్ధకం, పైల్స్, గ్రాంగ్రీను, ట్రైగ్లిజరైడ్స్, పీసీఓడీ, అతి తక్కువ వీర్యకణాలు, చర్మవ్యాధులు, మూత్రపిండాలు, థైరాయిడ్‌ సంబంధిత అనారోగ్యాలతోపాటు మెదడు సంబంధమైన, రక్త సంబంధమైన వంటి జబ్బులేవీ లేకుండా సంపూర్ణ ఆరోగ్యాన్ని సిరిధాన్యాలు అందిస్తాయని రుజువైందని తెలియజెబుతున్నారు.

మన దేశంలో కేన్సర్‌ నిర్థారణ రోజుకు 2,000 మంది

కేన్సర్‌ మరణాలు.. రోజుకు 1,500 మంది

కేన్సర్‌తో ఏటా చనిపోతున్న భారతీయులు: 5,56,400  మంది

2020 నాటికి పెరగనున్న కేన్సర్‌ రోగుల సంఖ్య 17.3 లక్షలు

రోజూ శారీరక శ్రమ లేదా వ్యాయామం చేయాలి.

ఏదన్నా చేయండి చెమట పట్టేలా చేయాలి! వంటికి చెమట పట్టడం చాలా మందికి ఇష్టం లేక ఇటువంటి పనులు చేయటం లేదు. ఇది అసలు సరైనది కాదు. చెమట పట్టడం వల్ల దేహంలో నుంచి వ్యర్థాలను, కల్మషాలను బయటకు పంపటంతోపాటు.. మనం శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నామనడానికి నిదర్శనం కూడా.

No comments:

Post a Comment