What Dr khadar vali saying to the society People Nation

డాక్టర్ ఖాదర్ చేసిన గొప్ప పని ఏమిటి

What Dr khadar vali saying to the society People Nation

ఇన్నాళ్లూ ఒక్క శాస్త్రవేత్త కీ పట్టలేదు
ఒక్క విశ్వ విద్యాలయానికి పట్టలేదు
బిలియన్ల డాలర్లు ఖర్చు పెట్టి క్యాన్సర్ల అంతు తేల్చేస్తాము అనే అంతర్జాతీయ సంస్థలకూ పట్టలేదు
'డయాబెటీస్ కి మందు లేదు బాబూ, నీ జన్మంతా ఇన్సులిన్ మీదో, మందుల మీదో ఆధారపడి బ్రతుకు'--
అని చెప్పే డాక్టర్ ల కీ తట్ట లేదు
న్యూట్రిషనిస్టులం అని చెప్పుకునే వారికీ తగిన విజ్ఞానం ఉన్నట్లు లేదు
ఆహారం మన ఆరోగ్యానికి ఒక ముఖ్యమైన పునాది-- అనే మాట కూడా
ఇప్పటికీ వీళ్ళెవరూ నోరు తెరిచి చెప్పాలనే అనుకోవడంలేదు.

మరి డాక్టర్ ఖాదర్ చేసిన గొప్ప పని ఏమిటి?

ఆహారం తో ఆరోగ్యం సాధించుకోవచ్చని చెప్పాడు
రోగాలు వస్తే ఆహారం, కషాయాల ద్వారా పోరాడి తగ్గించుకోవచ్చు అన్నాడు
మందులు, వైద్యానికి లొంగని రోగాలు అని పేర్లు పెట్టి , జన్మంతా టాబ్లెట్ లూ, క్యాప్సూల్స్,
ఇంజక్షన్ లూ తీసుకుంటేనే అంతంత మాత్రం జీవితాన్ని గడపొచ్చు అని వైద్యులు
చెప్పే మాటలని ప్రక్కపెట్టొచ్చు, ధైర్యంగా బ్రతకొచ్చు అని కూడా నేర్పాడు
ఒక రోగానికి మందులు వేసుకుంటే, మరో రెండు కృత్రిమ క్రొత్త రోగాలు పుట్టించే వ్యవస్థ నుండి
జాగ్రత్త పడే మార్గాలూ నేర్పాడు।

సిరిధాన్యాలు వెలికి తీసాడు।
జన బాహుళ్యం లోకి తెచ్చాడు
అంతటా సులభంగా దొరికే ఆకులూ, దినుసుల్లతో కాషాయలూ నేర్పాడు
మీ రోగాలు మీరే మీ చేత్తోటే తగ్గించుకోండి అని
మార్గం చూపాడు
What Dr khadar vali saying to the society People Nation
What Dr khadar vali saying to the society People Nation

ఇదంతా ప్రజలకి వేగం గా ఎక్కేస్తుంటే,
ధైర్యంగా బ్రతకటం సాధారణమై పోతుంటే
చిరాకు పడేది ఎవరు?
తమ నష్టాలు లెక్కలు కట్టుకునే మందుల కంపెనీ లూ, డాక్టర్లూ,
ఎరువుల మందుల వాళ్ళు, పురుగుల మందుల వాళ్ళు,
ఆహారం పై తమ ఆధిపత్యం చేయి జారీ పోతోందని ఏడ్చే బడా బాబులూ
కార్ఖానా ల యజమానులూ - వీరికి అండ గా నిలిచే పేపర్ వాళ్ళు ,
మరి వీరంతా---
మన వ్యవస్థ ను నడిపించే పెద్ద విగ్రహాలు
ప్రజల బాగు ను ఏ మాత్రం కోరని పెద్ద మనుషులు
'సిరిధాన్యాలు' తినకండి' అని కూడా సలహాలు చెప్పడానికి వెనుకాడ కుండా
ముందుకు త్రోసుకొని వచ్చారు।

ప్రజలకి తెలియదా ఏది మంచో ఏది చెడో
వాళ్ళకి కావలసింది కొంచెం విజ్ఞానం
అది వారికి దొరికేసింది
ఉజ్జ్వలమైన 'రేపు' ను గుప్పిట్లో ఎలా బంధించాలో
వారికీ తెలిసి పోయింది
సిరిధాన్యాల జైత్ర యాత్ర కొనసాగి తీరుతుంది

నేలలూ సంతోషిస్తాయి
భూమాత కూడా ఆశీర్వదిస్తోంది
భూ జలాలూ ఆనందిస్తాయి
నీటి సంపద పెరుగుతుంది
ఆరోగ్య సంపద పెరుగుతుంది
రసాయనాల కాలుష్యం తగ్గుతుంది
భవిష్యత్తు బాగుంటుంది ।।

Post a Comment

0 Comments