Mar 18, 2024

Stop iron deficiency with Finger Millets

ర‌క్త‌హీన‌త స‌మ‌స్య‌కు చెక్ పెట్టే రాగులు..!
Stop iron deficiency with Finger Millets

మ‌న శ‌రీరానికి ఎన్నో ర‌కాల ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాల‌ను అందించే సిరి ధాన్యాల‌లో రాగులు కూడా చాలా ముఖ్య‌మైన‌వి. వీటితో చాలా మంది చాలా ర‌కాల ప‌దార్థాల‌ను చేసుకుని తింటుంటారు. అయితే రాగుల‌తో జావ చేసుకుని తాగితే దాంతో ఎన్నో ర‌కాల లాభాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. రాగి జావ‌ను తాగితే మన శరీరానికి శక్తి లభిస్తుంది. అలాగే రాగుల్లో ఉండే పోషకాలు కూడా మనకు అందుతాయి. ముఖ్యంగా ప్రోటీన్లు, ఎ, బి, సి విటమిన్లు, మినరల్స్ మనకు అందుతాయి. దీంతో జీర్ణశక్తి పెరుగుతుంది.

2. రాగుల్లో ఉండే ప్రోటీన్లు నిత్యం వ్యాయామం చేసే వారికి చక్కగా ఉపయోగపడతాయి. వారిలో కండరాల నిర్మాణం సరిగ్గా ఉంటుంది. ఎదిగే పిల్లలకు రాగి జావ తాగిస్తే వారి శరీర నిర్మాణం సరిగ్గా ఉంటుంది. అవయవాల్లో లోపాలు లేకుండా పిల్లలు ఎదుగుతారు. వారిలో స్థూలకాయం రాకుండా ఉంటుంది.

3. రాగుల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. అందువల్ల రాగులను తీసుకుంటే శరీరానికి కావల్సిన కాల్షియం అంది తద్వారా ఎముకలు, దంతాలు దృఢంగా మారుతాయి. రాగుల్లో ఉండే పాలిఫినాల్స్, డైటరీ ఫైబర్ మధుమేహాన్ని నియంత్రిస్తాయి.
Stop iron deficiency with Finger Millets
Stop iron deficiency with Finger Millets

4. రాగులను నిత్యం ఆహారంలో భాగం చేసుకుంటే వృద్ధాప్య ఛాయలు త్వరగా రావు. చర్మం కాంతివంతంగా, మృదువుగా ఉంటుంది. ఎప్పుడూ యవ్వనంగా కనిపిస్తారు. రాగుల్లో ఐరన్ పుష్కలంగా ఉండడం వల్ల రక్తహీనత సమస్య నుంచి బయట పడవచ్చు.

5. అధిక బరువును తగ్గించడంలో, శరీరానికి మానసిక ప్రశాంతతను అందజేయడంలో రాగులు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. తలనొప్పి తగ్గుతుంది. డిప్రెషన్, ఆందోళనను నివారించే గుణాలు రాగుల్లో ఉంటాయి.

Subscribe to get more Images :