Breaking

Tollywood Bollywood Hollywood Kollywood Indian Models Actors Actress Latest Photo Shoot Stills Photos Pictures Movie Posters Gallery Pics Wallpapers Movies List

Ads

30 August 2019

Frequently Asked Questions Siridhanyalu Millets Dr Khadar Vali Health Tips

సిరిధాన్యాల తో సంపూర్ణ ఆరోగ్యం

సిరిధాన్యాల వినియోగదారుల కు వచ్చే సాదరణ సందేహాలు... సమాధానాలు.... సిరిధాన్యాలు అంటే ఏమిటి ?

Frequently Asked Questions about Siridhanyalu Millets Dr Khadar Vali Health Tips

వరి బియ్యం, గోధుమలు వలె ఇవికూడా ఆహారంగా స్వీకరించడానికి అనువైన ధాన్యం. పూర్వం అంటే సుమారు 100 సంవత్సరాల క్రితం మన పూర్వీకులు మన నేలల్లో/ భూమిలో పండించి సంపూర్ణ ఆహారంగా స్వీకరించిన ధాన్యాలు ఇప్పుడు మనం చెప్పుకుంటున్న సిరిధాన్యాలే...
కాల క్రమంలో నీటి డ్యాము ల నిర్మాణం,నీటి లభ్యత, వ్యవసాయ విప్లవం, అభివృద్ధి చెందుతున్న దేశాల ఆధిపత్య ప్రభావంతో మన ప్రాచీన, సంప్రదాయ పంటలయిన కొర్రలు, సామలు, ఊదలు, అరికలు, అండుకొర్రలు అనే పంచ చిరు (సిరి) ధాన్యాల సాగు మన ప్రాంతాల్లో కనుమరుగై వాటి స్థానంలో నీటి ఆధారిత పంటలయిన వరి, గోధుమలు మన భూముల్లో పండించడం ప్రారంభించి , వరి బియ్యం, గోధుమలు మన ప్రధాన ఆహారంగా తీసుకోవడం ప్రారంభించాము, ఈ ఆహారం వల్ల గ్లూకోస్ ఏక మొత్తం లో ఓకే సారి రావడం వల్ల, గ్లూకోస్ మనకు కావాల్సిన డానికి కంటే ఎక్కువైనది ఫ్యాట్ గ మారి బరువు పెరగడం, తద్వారా మన శరీరం లోకి అన్ని దీర్ఘకాలిక రోగాలు , సాధారణ రోగాలు, కీళ్ల నొప్పులు, మోకాళ్ళ అరుగుదల రావడం ప్రారంభించాయి.

Frequently Asked Questions about Siridhanyalu Millets
Frequently Asked Questions about Siridhanyalu Millets

సిరిధాన్యాలను ఎలా వండుకోవాలి ?

ఏ సిరిధాన్యము అయినా 8 గంటలు నానబెట్టి వండుకోవాలి. రాత్రి నానబెట్టి ఉదయం వండుకోవడం, ఉదయం నానబెట్టి రాత్రి వండుకోవడం ఉత్తమం.

ఎందుకు నాన బెట్టాలి.?

అన్ని సిరిధాన్యాల్లో ఫైబర్ శాతం మన శరీరానికి అవసరం అయినంత ఉంటుంది, ఫైబర్ నిష్పత్తి 65:8 నుండి 65:12.5 వరకు ఉంటుంది . అంటే పిండి పదార్థం 65 ఉంటే పీచు పదార్థం (ఫైబర్) కనీసం 8 శాతం ఉంటుంది...
వరి బియ్యంలో పిండి పదార్థం నిష్పత్తి 395: 0.2 అంటే దాదాపు పీచు పదార్థం శూన్యం...
ఆవాల పరిమాణం కంటే కొద్దిగా పెద్ద పరిమాణం లో వుండే సిరిధాన్యాల కేంద్రం నుండి పై వరకు పొరలు పొరలు గా ఫైబర్ ఉంటుంది . భగవంతుని అద్భుత సృష్టి తో సుమారు ఏడు పొరల్లో నిక్షిప్తమయిన ఈ ఫైబర్ పూర్తిగా నానడానికి 8 గంటలు పడుతుంది. అందుకే ఉదయం నానబెట్టి రాత్రి, రాత్రి నానబెట్టి ఉదయం వండుకోవాలి.

సిరిధాన్యాలతో ఏ ఆహారం చేసుకోవచ్చు.?

సిరిధాన్యాలతో అన్నం , ఇడ్లీ లు, దోశ, ఉతప్ప, పెరుగన్నం, సాంబారు అన్నం , సర్వపిండి, మురుకులు, దోసకాయరొట్టె, గారెలు, ఇలా 30 రకాల పైన వెరైటీ లు వండుకోవచ్చు. వరి బియ్యం తో వండే ప్రతి వంటను సిరిధాన్యాలతో వండుకోవచ్చు.

ఎందుకు తినాలి ?

ఆహారపు అలవాట్ల ద్వారా సంక్రమిస్తున్న అన్ని వ్యాధులను దూరం చేసుకోవడానికి, పూర్తి ఆరోగ్యంగా ఏ వ్యాధి రాకుండా ఉండడానికి, ఊబకాయము సమస్య పోవడానికి సిరిధాన్యాల ను సంపూర్ణ ఆహారంగా తీసుకోవాలి.

ఎన్నిరోజులు తినాలి?

మన ఊపిరి ఉన్నంత కాలం సిరిధాన్యాల నే సంపూర్ణ ఆహారంగా స్వీకరించాలి.

ఎలా తినాలి ?

ఆరోగ్యంగా ఉన్నవారు సిరిధాన్యాల రెండు, రెండు రోజులు మార్చి, మార్చి తినాలి, అంటే రెండు రోజులు కొర్రలు, రెండు రోజులు సామలు, రెండు రోజులు ఊదలు అలా...సైకిల్ లా తీసుకోవాలి.
అన్ని విడివిడిగా తినాలి,
ఒక దానితో ఒకటి కలుపవద్దు

5 రకాలు తప్పనిసరిగా తినాలా?

అన్ని తప్పనిసరిగా తినాలి, ఎవయినా అందుబాటులో లేనప్పుడు అందుబాటులో ఉన్న సిరిధాన్యాలను తినాలి.

పొట్టు తీయని unpolished వే తినాలా?

పొట్టు తీయని(unpolished) తినడం ఉత్తమం.
Unpolished లభించనప్పుడు పొట్టు తీసిన polished సిరిధాన్యాలు ఆహారంగా తీసుకొన్నా నష్టం లేదు.

సిరిధాన్యాల ధరలు ఎందుకు అధికంగా ఉన్నాయి?

సిరిధాన్యాలను పండించే వారు తక్కువగా వున్నారు, స్వీకరించే వారు అధికమయ్యారు, డిమాండ్ కు సరిపడా సప్లయి లేనందున, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు దేశవ్యాప్తంగా సప్లయి చేయాల్సివస్తుంది...ఇతర రాష్టలు సిరిధాన్యాల ను దిగుమతి చేసుకోవాల్సి వస్తున్నందున వాటి ధరలు అధికంగా ఉన్నాయి.

ఏ నూనెల ను వాడాలి ?

ఎట్టి పరిస్థితుల్లో రెఫైన్డ్ నూనెలు వాడవద్దు. గానుగలో పట్టిన నూనెలను వాడడం ఉత్తమం.ఆరోగ్యానికి కొబ్బరినూనె, కుసుమ నూనె లు చాలా మంచిది, కొబ్బరి, కుసుమ, పల్లి, నువ్వుల నూనెలు మార్చి, మార్చి వాడాలి. కొబ్బరినూనె వాసన ఉన్నట్లు అనిపిస్తే కుసుమ నూనె వాడండి, పల్లి నూనెలగా ఉంటుంది, వాసన తో ఇబ్బంది ఉండదు.

సిరిధాన్యాల పంటలు ఎలా పండించాలి?

సిరిధాన్యాల పంటల సాగుకు చాలా తక్కువ నీరు అవసరం. ఎకరానికి 4 కిలోల విత్తనాలు సరిపోతాయి, ( నారు పోసి నాటే విధానం లో ఒక ఎకరానికి కిలో లోపు విత్తనాలు సరిపోతాయి). కలుపు తీయాల్సిన , పురుగుల మందులు, రసాయనాలు చల్లాల్సిన అవసరం లేదు.
ప్రకృతిని, భూమిని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ భూగర్భ జలాలను కాపాడుతూ రైతులు అధిక లాభాలు సిరిధాన్యాల పంట సాగు ద్వారా పొందవచ్చు. తద్వారా స్థానికంగా అందుబాటులో ఉండి వినియోగదారుల కు సరిఅయిన ధరలో సిరిధాన్యాలు లభిస్తాయి.

మనం తినకూడని ఆహారపదార్థాలు ఏవి?

వరి బియ్యం, గోధుమలు, గోధుమ పదార్థాలు, మైదా,పాలు, టీ,కాఫీలు,చక్కెర, అయోడైజ్డ్ ఉప్పు(సముద్రపు నీటిద్వారా తయారు చేసిన ఉప్పు వాడడం మంచిది), మాంసం, గుడ్లు.

మనం విడువవలసిన చెడు అలవాట్లు ఏవి?

గుట్కా, మద్యం, ధూమపానం,మత్తు పదార్ధాలు

ఎంత వివరణ ఇచ్చినా, ఎన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినా ఇంకో కొత్త ప్రశ్న, సందేహం వస్తూనే ఉంటుంది, ఎందుకంటే మనిషి మెదడు ప్రశ్న/ సందేహాల ఉత్పత్తి కేంద్రం....
ఓకే గుడ్డి గుర్తు ...అయిదు సిరిధాన్యాల ను 6 వారాల నుండి ఆరు నెలలు మార్చి మార్చి తినాలి, వాడకూడని పాలు, చెక్కర, రెఫైన్డ్ నూనెలు, వరి బియ్యం, గోధుమలు, iodized ఉప్పు, మాంసాహారం మానివేసి సిరిధాన్యాల ను సంపూర్ణ ఆహారంగా స్వీకరించడం వల్ల అన్ని అనారోగ్య సమస్యలనుండి బయటపడవచ్చని, ఆరోగ్యవంతులు ఏ అనారోగ్య సమస్యలు దరి చేరవని డాక్టర్ ఖాదర్ వలి గారు చెబుతారు.
ఇంకా అధిక సమాచారం కోసం సిరిధాన్యాల తో సంపూర్ణ ఆరోగ్యం, అమృతాహారం పుస్తకాలు చదవండి, యూట్యూబ్ లో డాక్టర్ ఖాదర్ వలి గారి వీడియోలు చూడండి.
సంకల్పం, కమిట్మెంట్ ఉండాలి, మనసు శరీరాన్ని నియంత్రించాలి, శరీరం మనసును శాసించకుండా చూసుకోవాలి....
అందరికీ మందులు లేని సంపూర్ణారోగ్యం లభించాలని, ప్రతి వంటింట్లో సిరిధాన్యాల ఘుమఘుమలు వ్యాపించాలని ఆశిస్తూ........?

Millets are good | Millets Diet Pros and Cons | Dr Khadar Vali Health Tips

No comments:

Post a Comment