Apps That Help You Cook With What You Have in Your Home

ఈ యాప్ ఉంటే.. ఏమైనా వండొచ్చు
Apps That Help You Cook With What You Have in Your Home

‘అరేయ్​.. రూమ్​లో టొమాటోలు, రెండు ఉల్లిగడ్డలు మాత్రమే ఉన్నాయ్​. జేబులో పైసల్​ కూడా లేవ్​? రైస్​ అయితే.. కుక్కర్​లో పెట్టేశిన. కూర ఏం చేయాల్నో అర్థం అయితలేదు. పచ్చడి కూడా రాత్రే అయిపోయింది’. ఫ్రెండ్స్​తో కలిసి రూమ్​లో ఉంటున్న ఓ బ్యాచిలర్​కి వచ్చిన వంట కష్టం ఇది. ‘ఉన్నవా..? చికెన్​ తెచ్చిన. ఏదన్న స్పెషల్​ చెయ్​’ ‘ఎంత తెచ్చినవ్​?’ ‘ఉన్నది ముగ్గురమే కదా.. అద్దకిలో తెచ్చిన.. సరిపోదా?’ ‘అద్దకిలో చికెన్​తో ఏం చేయమంటవ్​? ఫ్రై చేయనా? కర్రీ చేయనా? ‘యే.. ఊకో.. ఎప్పుడు ఫ్రై, కర్రీయేనా? ఏదన్న స్పెషల్​ చెయ్​’ ‘అద్దకిల కూరల ఏం చెయ్యాలె చెప్పు’ రెగ్యులర్​ ఫుడ్​ తిని బోర్​ కొట్టిన ఓ జంట మధ్య అరకిలో చికెన్​లో ఏం స్పెషల్​ చేసుకోవాలన్న చర్చ ఇది. అటు బ్యాచి​లర్స్​కి, ఇటు ఫ్యామిలీస్​కి వంట కష్టాలు దూరం చేస్తూ.. ఉన్న వాటితో ఏం వండుకోవాలి? ఎలా వండుకోవాలో చెప్పే స్టార్టప్​ వచ్చేసింది. దాని గురించే ఈ స్పెషల్​ స్టోరీ!

ఏం వండుకోవాలి? ఎలా వండుకోవాలి? వండుకోవడానికి ఇంట్లో ఏమున్నాయి? వంట మొదలుపెట్టేటప్పడు అందరికీ ఎదురయ్యే సమస్యే ఇది. కొన్నిసార్లు ఏదైనా వండాలనుకున్నప్పుడు కొన్ని వంట సరుకులు ఉండవు. అప్పుడు ఏం చేయాలి?  ఆ దినుసులు కొని తెచ్చి వంట మొదలుపెట్టాలి. లేదంటే.. వేరే వంటకు షిఫ్ట్​ అవ్వాలి. ఇక బ్యాచిలర్స్​ వంట కష్టాలైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రోజూ వాళ్లు వంటతో ఓ యుద్ధమే చేస్తారు. ఇదంతా ఒక ఎత్తయితే.. అసలు రోజులో ఎన్ని కార్బోహైడ్రేట్లు మన శరీరానికి అందుతున్నాయి. మనం రోజూ తినే ఫుడ్​లో ఎన్ని కాలరీలు ఉంటున్నాయి? ఈ ప్రశ్నలకు సమాధానమే ‘వాట్​ టు కుక్’​ స్టార్టప్​. స్మార్ట్​గా ఆపరేట్​ అయ్యే యాప్​ ద్వారా ఈ ప్రశ్నలన్నిటికీ చిటికెలో సమాధానం దొరుకుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ యాప్​కి మంచి క్రేజ్​ వస్తోంది. ఇంతకీ ఈ స్టార్టప్​ పెట్టింది, యాప్​ తయారుచేసింది ఎవరో తెలుసా! మన కుర్రాళ్లే.. సాయి సంతోష్​, కార్తికేయన్​.

ఎవరు ఎంత చేసినా? ఎంత సంపాదించినా.. ఆకలవగానే.. కడుపులో ఇంత పడాల్సిందే. ఆ తినేదేదో.. రుచిగా ఉండాలి.. శరీరానికి అవసరమయ్యే పోషకాలు అందించాలి. అయితే.. వండిన వంటలే రిపీట్ చేస్తుంటే తినాలంటే కూడా విసుగు పుడుతుంది . వెరైటీ వంటలు చేయాలంటే.. యూట్యూబ్ సాయం తీసుకోవాల్సిందే. కానీ.. అందులో ఏవేవో ఇంగ్రెడియంట్స్​ వేయమని చెప్తుంటారు. అయితే.. వాట్ టు కుక్ యాప్ వీటన్నిటికంటే డిఫరెంట్ .

Apps That Help You Cook With What You Have in Your Home
Apps That Help You Cook With What You Have in Your Home

ఏం వండుకోవాలో చెప్తరు!

ఇదే స్పెషాలిటీ..

ఏదైనా వండాలంటే అందులోకి కావల్సిన పదార్థాలన్నీ సిద్ధం చేసుకొని కుకింగ్​ మొదలుపెడతాం. కానీ.. ‘వాట్​ టు కుక్’​ యాప్​ మీ మొబైల్​లో ఉంటే.. ఆ పద్ధతికి టాటా చెప్పొచ్చు. ఎందుకంటే.. మన దగ్గర ఏమున్నాయో ఆ యాప్​లో ఎంటర్​​ చేస్తే చాలు.. వాటితోనే ఏం వండుకోవచ్చో క్షణాల్లో రిజల్ట్​ చూపిస్తుంది. ఉదాహరణకు మీ ఇంట్లో నాలుగు టొమాటోలు, ఒక ఉల్లిగడ్డ, మూడు పచ్చిమిర్చి ఉన్నాయనుకోండి. అప్పుడేం చేస్తారు? ఉల్లిగడ్డ, టమాట కర్రీ వండేస్తారు. అంతకు మించి వేరే వంట చేయడానికి సాహసం చేయం. కానీ.. వాట్​ టు కుక్​ అలా కాదు. మీ దగ్గర ఏమేం ఉన్నాయో చెప్తే.. వాటితో ఎన్ని రకాల వెరైటీలు చేసుకోవచ్చో చెప్పేస్తుంది. అంతేకాదు.. మీరు వండిన ఆ వంటలో ఎన్ని కేలరీలున్నాయి?  ఎన్ని కార్బోహైడ్రేట్లున్నాయి? అనే వివరాలు కూడా చెప్తుంది. ఆ వంటకం చేయడానికి మీరు ఫోన్​ని చూస్తూ ఉండాల్సిన పని లేదు. వంటకం పక్కనే  ఉన్న ‘ప్లే’ ఆప్షన్​ నొక్కితే చాలు. వంట ఎలా చేయాలో ప్రాసెస్ అంతా ఆడియో ఫార్మాట్​లో ప్లే అవుతుంది. ఆ వంటకాలన్నీ పేరున్న సెలబ్రిటీ షెఫ్​లు వండినవే కావడం ఇక్కడ మరో విశేషం. – ప్రవీణ్‌కుమార్‌ సుంకరి

కుర్రాళ్ల గురించి

ఈ స్టార్టప్​ని సాయి సంతోష్​, కార్తికేయన్​ అనే ఇద్దరు ఫ్రెండ్స్​ మొదలుపెట్టారు. అందులో సాయి సంతోష్​  తెలుగువాడే. కార్తికేయన్​, సాయి సంతోష్​ ఇద్దరూ భువనేశ్వర్​లో ఐఐటీ కలిసి చదివారు. గ్రాడ్యుయేషన్​ అయిపోయిన తర్వాత కార్తికేయన్..​ పై చదువుల కోసం విదేశాలకు వెళ్లిపోయాడు. సాయి సంతోష్​ కాగ్నిజెంట్​లో  రీసెర్చ్​ డెవలప్​మెంట్​లో ఉద్యోగంలో చేరాడు. ఒకరి దగ్గర ఉద్యోగం చేయడం కంటే.. తానే సొంతంగా ఏదైనా బిజినెస్‌ చేయాలనుకున్నాడు సాయి సంతోష్​. ఆ తపనలోంచి పుట్టిందే ‘వాట్​ టు డూ’ అనే ఆలోచన. ఆ పేరు మీదుగానే స్టార్టప్​ పెడదామనుకున్నాడు. తన ఆలోచనను కార్తికేయన్​కి చెప్పాడు. ఆ సమయంలో సాయి సంతోష్​ బరువు నూట ఇరవై కిలోలు. ఏం పని  చేసినా క్షణాల్లోనే అలసిపోయేవాడు. దీనికి కారణం ఒబెసిటీకే బరువు. ముందు బరువు తగ్గించుకోవాలనుకున్నాడు. అందుకు డైట్​ ప్లాన్​ చేసుకున్నాడు. వర్కవుట్లు చేశాడు. ఈ సమయంలో ఫుడ్​ తగ్గించడం వల్ల తన హెల్త్​ మీద ఎలాంటి ఎఫెక్ట్​ పడకుండా జాగ్రత్తపడ్డాడు. ఫుడ్​లో ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు తగ్గకుండా డైట్​ ప్లాన్​చేసుకున్నాడు. ఏం తిన్నా.. దానిలో ఎన్ని కాలరీలు ఉన్నాయి. ఎంత శాతం కార్బోహైడ్రేట్లు ఉన్నాయి అని చూసుకునేవాడు. అప్పుడే వాట్​ టు కుక్​ అనే ఆలోచనకు పదును పెట్టాడు. అదే.. వాట్​ టు కుక్​కి శ్రీకారం చుట్టింది. తమ పనిని పరీక్షించుకోవడానికి ఇజ్రాయెల్​లో నిర్వహించిన ప్రెస్టీజియస్​ ‘మాస్​ చాలెంజ్​’ కాంపిటీషన్​లో తమ స్టార్టప్​ని ప్రజెంట్​ చేశారు. ఆ చాలెంజ్​లో ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఐదు స్టార్టప్​ ఎక్స్​లెటర్లు సెలక్ట్​ అయితే.. అందులో ‘వాట్​ టు కుక్​’ కూడా ఒకటి.

Post a Comment

0 Comments