Breaking

Tollywood Bollywood Hollywood Kollywood Indian Models Actors Actress Latest Photo Shoot Stills Photos Pictures Movie Posters Gallery Pics Wallpapers Movies List

Ads

09 November 2019

Why should we wash our hands before and after eating

చేతులు శుభ్రంగా కడుక్కుంటే చాలు
Why should we wash our hands before and after eating food

ఆఫీసులో వర్క్​ చేస్తున్నప్పుడు డెస్క్​ దగ్గరే ఏదో చిరుతిండి తింటారు. ఈ సమయంలో మౌస్,   కీబోర్డ్  వంటివి పట్టుకుని పనిచేసి ఉంటారు. దాంతో చేతులు దుమ్ము పట్టుకుని ఉంటాయి. అవి ఎంత అపరిశుభ్రంగా ఉంటాయో! వాటిపైన బోలెడన్ని క్రిములుంటాయి. బస్సులోనో, బైకుపైనో ప్రయాణిస్తూ, చేతితో మొబైల్  వాడుతూ, దారిలో ఆగి ఏ చిరుతిండో లాగిస్తారు. చేతికి బ్యాక్టీరియా, వైరస్​లు అంటుకుని ఉంటాయి. చేయి కడుక్కోకుండా తింటే అంతే సంగతులు. హానికర వైరస్​లు చేతి ద్వారా నోట్లోకి, అట్నుంచి కడుపులోకి వెళ్లి రోగాలు కలిగిస్తాయి. తినకపోయినా చేతి వేళ్లని నోట్లో, ముక్కులో, చెవుల్లో పెట్టుకోవడమో చేస్తుంటారు. దీనివల్ల కూడా జబ్బులొచ్చే అవకాశం ఉంది. చేతులు కడుక్కోకపోవడం వల్ల కొన్నిరకాల హానికర, అంటు వ్యాధుల్ని నివారించవచ్చు. తినే ముందు ప్రతి సారి తప్పనిసరిగా చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. చేతితో ఏది తినాలన్నా చేతులు శుభ్రంగా ఉండాలన్న విషయాన్ని గుర్తుంచుకోండి. బయటికి వెళ్లొచ్చిన తర్వాత, ప్రయాణం చేసిన తర్వాత ఇంటికి రాగానే విధిగా చేతులు కడగటం అలవాటు చేసుకోవాలి. దీని వల్ల మీరు మాత్రమే కాకుండా మీ ఇంట్లో వాళ్లకు కూడా అంటువ్యాధులు సోకకుండా కాపాడిన వాళ్లవుతారు.

Why should we wash our hands before and after eating
Why should we wash our hands before and after eating

ఐదు శాతమే

హ్యాండ్​ వాష్​ చేసుకుంటున్న వాళ్లలో ఐదు శాతం మందే సరిగ్గా చేతులు కడుక్కుంటున్నారని ఒక సర్వే వెల్లడించింది. అంటే మిగతా వాళ్లు పూర్తి పరిశుభ్రంగా చేతుల్ని ఉంచుకోవడం లేదు. అందుకే చేతులు ఎలా కడుక్కుంటే క్రిములు నశిస్తాయనే విధానంపై అవగాహన ఉండాలి. సోప్,  లిక్విడ్​ హ్యాండ్​ వాష్​ ఏదైనా సరే తడిగా ఉండే చేతుల్లోకి తీసుకుని, కనీసం అరనిమిషం పాటు రుద్దాలి. చేతి వేళ్ల మధ్య సోప్​ చేరేలా చేసి, మరో చేతి వేళ్లతో గట్టిగా రుద్దుకోవాలి. బొటనవేళ్లపై కూడా దృష్టిపెట్టాలి. చేతి వెనుక భాగాన్ని కూడా కడుక్కోవాలి.
అలాగే చేతులు కడుక్కున్న చేతితో ట్యాప్​ ఆఫ్​ చేయకూడదు. లేదా ముందుగానే ట్యాప్​ను శుభ్రం చేయాలి. చేతులు కడుక్కున్న తర్వాత శుభ్రమైన టవల్,  న్యాప్​కిన్​లతో తుడుచుకోవాలి. ఇలా చేసి భోజనం చేస్తే దాదాపు పద్నాలుగు రకాల అంటువ్యాధుల్ని నివారించవచ్చని నిపుణులు చెప్తున్నారు.

నోరోవైరస్

డయేరియా, అలసట, కడుపునొప్పి, ఇతర జీర్ణ సంబంధిత వ్యాధులకు కారణమమ్యే వైరస్​ ఇది. ఇతర వైరస్​లు కనీసం యాభై నుంచి వంద వరకు లోపలికి ప్రవేశిస్తే వ్యాధికి గురయ్యే  అవకాశం ఉంది. కానీ నోరోవైరస్​ ఒక్కటే శరీరంలోకి ప్రవేశించినా జబ్బు పడుతారు.
చేతులు అపరిశుభ్రంగా ఉన్నా, కలుషిత ఆహారం తిన్నా, వైరస్​ సోకిన వ్యక్తికి దగ్గరగా ఉన్నా నోరోవైరస్​ దాడి​ చేస్తుంది.
చేతులు కడుక్కుంటే ఈ వైరస్​ దాదాపు పూర్తిగా నశిస్తుంది.

ఫ్లూ

జలుబు, దగ్గు, జ్వరం, గొంతునొప్పి, ఒళ్లునొప్పులు వంటివి ఫ్లూ లక్షణాలు. ఇది కూడా అంటువ్యాధే. ఫ్లూ రాకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో హ్యాండ్​ వాష్​ ఒకటి. చేతులు పరిశుభ్రంగా ఉంచుకుంటే ఫ్లూ సోకే అవకాశాలు తగ్గుతాయి. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండి, తరచూ జబ్బు పడే వాళ్లు నిత్యం చేతుల్ని శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ఫ్లూ ముప్పును తప్పించుకోవచ్చు.

కండ్ల కలక

కంటిపాపలో తెల్లగా ఉండే భాగం ఎర్రగా, కాస్త గులాబి రంగులోకి మారిపోవడమే కండ్లకలక. కళ్లు దురదగా, మంటగా ఉండటం ప్రధాన లక్షణాలు.
బ్యాక్టీరియా, వైరస్, అలర్జీల కారణంగా వస్తుంది. సరిగ్గా హ్యాండ్​వాష్​ చేసుకుంటే ‘పింక్​ ఐ’ ముప్పు చాలా తగ్గుతుంది.

సాల్మొనెల్లోసిస్

సాల్మొనెల్లా అనే బ్యాక్టీరియా వల్ల వచ్చే అంటు వ్యాధి ఇది. వాంతులు, జ్వరం, చలి, తలనొప్పి వంటివి లక్షణాలు. ఈ వైరస్​ మనుషులు, జంతువుల పేగు గోడల్లో నివసిస్తుంది. మాంసాన్ని సరిగ్గా వండకుండా తింటే వైరస్​ సోకే అవకాశం ఉంది. అలాగే జీవుల మలం ద్వారా కూడా ఈ వైరస్​ గాలిలో ప్రవేశిస్తుంది. అందువల్ల వాష్​రూమ్​కు వెళ్లినప్పుడు, పిల్లల డయపర్లు మార్చినప్పుడు వెంటనే హ్యాండ్​ వాష్​ చేసుకోవాలి. లేకుంటే వైరస్​ సోకి సాల్మొనెల్లా బారిన పడతారు.

హ్యాండ్​ ఫూట్​ అండ్​ మౌత్​ డిసీజ్

చిన్న పిల్లల్లో ఎక్కువగా కాళ్లు, చేతులు, నాలుకపై పొక్కులు వస్తుంటాయి. గొంతునొప్పి, దురద వంటి లక్షణాలుంటాయి. ఇదే ‘హ్యాండ్​ ఫూట్​ అండ్​ మౌత్​ డిసీజ్’.  డేకేర్​ సెంటర్స్,  ప్రీ స్కూల్స్​లో ఉండే పిల్లలకు ఎక్కువగా వస్తుంటుంది. ఈ అంటువ్యాధి సోకకుండా ఉండాలంటే పిల్లల చేతులు శుభ్రంగా ఉండాలి.

Why should we wash our hands before and after eating
Why should we wash our hands before and after eating

ఇ- కొలి

సరిగ్గా శుభ్రం చేయని, ఉడకని మాంసం, కూరగాయల ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది ఇ కొలి బ్యాక్టీరియా. ఇది ఆహారం ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇ కొలి దరిచేరకుండా ఉండాలంటే ఆహార శుభ్రతతోపాటు, చేతుల శుభ్రత కూడా అవసరం.

హెపటైటిస్–ఎ

వైరస్​ కారణంగా సోకే హెపటైటిస్–ఎ,బి,సి లను ఎదుర్కోవాలంటే చేతుల శుభ్రత మంచి పరిష్కార మార్గం.
ముఖ్యంగా వాష్​రూమ్​కు వెళ్లొచ్చిన తర్వాత, భోజనం చేసే ముందు తప్పనిసరిగా చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. అందులోనూ రెస్టారెంట్లు, హోటళ్లలో తినేముందు మరింత జాగ్రత్తగా ఉండాలి. వీటితోపాటు ‘మోనో న్యూక్లియోసిస్,  సైటో మెగాలోవైరస్,  కామన్​ కోల్డ్,  స్టాఫ్,  ఆర్​ఎస్​వీ, స్ట్రెప్​ థ్రోట్,  జియార్డియాసిస్ వంటి జబ్బులు రాకుండా ఉండాలంటే చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవడం ఎంతో ముఖ్యం.

No comments:

Post a Comment