Nov 9, 2019

How To Reduce Thyroid Disease Millets And Kashayalu

థైరాయిడ్ కు ఎలాంటి ఆహారం తీసుకోవాలి సిరిధాన్యాలు కషాయాలు
How To Reduce Thyroid Disease Millets And Kashayalu

సిరిధాన్యాలు

సామలు         ...  వరుసగా 3 రోజులు
అరికలు        ...  1రోజు
కొర్రలు           ... 1 రోజు
అండు కొర్రలు ... 1 రోజు
ఊదలు          ... 1 రోజు

మొత్తం ఒక ఆవర్తనం/సైకిల్ 7 రోజులు. ఈ ఆవర్తనం/సైకిల్ రిపీట్ చేస్తుండాలి. అంటే 7 రోజుల తరువాత మళ్ళీ సామలతో మొదలు పెట్టాలి. ఇలా ఆహారం 3 పూటలా కడుపునిండా తీసుకుంటూ ఉండాలి. 3 పూటలా తప్పనిసరిగా అంబలి రూపంలో తీసుకోవాలి. ఈ అంబలితో పాటు మీకు నచ్చిన కూరలు, పప్పు, సాంబార్, రసం మొదలైనవి అన్ని హాయిగా తినండి.

ధాన్యాన్ని తప్పనిసరిగా 6 నుండి 8 గంటలు నానబెట్టిన తరువాతనే మాములు స్టవ్ మీద వండుకోవాలి. కుక్కర్లు వాడకూడదు. మట్టి పాత్రలు లేక స్టీల్ పాత్రల్లో మాత్రమే వండుకోవాలి. అలా నానబెట్టి వండుకున్న దానిని గంజి అంటాము. దానిని మరొక 8 గంటలు వదిలేస్తే దానిని అంబలి అంటాము. అంబలి రూపం లో కనీసం 3 నుండి 6 నెలలు వాడితే ఆరోగ్యం త్వరగా మెరుగు అవుతుంది. చల్లగా ఉన్న అంబలిలో వేడి పదార్థాలు ఏవి కలపకూడదు.

How To Reduce Thyroid Disease Millites And Kashayalu
How To Reduce Thyroid Disease Millites And Kashayalu

రాత్రి భోజనం 7 గంటలకు ముగించి, 9-9.30కల్లా చీకటి గదిలో/వెలుగు పడని చోట నిద్రపోవాలి.

కషాయాలు

మునగ పూత/మునగ ఆకు - 7 రోజులు
చింత చిగురు ఆకు - 7 రోజులు
తమలపాకు ఆకు - 7 రోజులు (ఆకు కాడ తీసివేసి వాడాలి)
కానుగ ఆకు - 7 రోజులు
తిప్పతీగ ఆకు - 7 రోజులు
గోంగూర ఆకు - 7 రోజులు
పసుపు ఆకు - 7 రోజులు
సాదాపాకు ఆకు - 7 రోజులు

ఇది మొత్తం 56 రోజుల ఆవర్తనం/సైకిల్. 56 రోజులయ్యాక మళ్ళీ మునగ ఆకులతో మొదలు పెట్టాలి.. కషాయాలు రోజు ఉదయం ఖాళీ కడుపులో తాగాలి. సాయంత్రం కూడా ఖాళీ కడుపులో అదే ఆకుల కషాయం ఫ్రెష్ గా చేసుకుని తాగాలి.

త్రాగే నూనెలు - ఎద్దు గానుగ నూనెలు మాత్రమే!

కొబ్బరి నూనె 3 చెంచాలు - 7 రోజులు
కుసుమల నూనె 3 చెంచాలు - 7 రోజులు
వేరుశెనగ నూనె 3 చెంచాలు - 7 రోజులు
నువ్వుల నూనె 3 చెంచాలు - 7 రోజులు

ఇది మొత్తం 28 రోజుల ఆవర్తనం/సైకిల్. 28 రోజులయ్యాక మళ్ళీ కొబ్బరి నూనెతో మొదలు పెట్టాలి.. నూనె రోజు ఉదయం ఖాళీ కడుపులో తాగాలి. రోజుకు ఒక్కసారి మాత్రమే. నూనెలు ఎద్దు చెక్క గానుగ లో తీసిన స్వచ్ఛమైనవి మాత్రమే వాడాలి. వేరే ఏ ఇతర నూనెలు తాగినా ఫలితం రానే రాదు.

కిడ్నీ సమస్యలు, లివర్ సమస్యలు ఉన్నవారు ఈ నూనెలు తాగకూడదు. ఈ సమస్యలు మీకు లేవని మీరు చెప్పారు కాబట్టి మీకు ఈ నూనెలు తాగమని చెపుతున్నాము. ముందు జాగ్రత్తగా మీరు ఒకసారి కిడ్నీ ప్రొఫైల్, లివర్ ప్రొఫైల్, యూరిన్ లో ప్రోటీన్ అండ్ అల్బుమిన్ అనే పరీక్షలు చేయించుకుని, ఆవేన్నీ నార్మల్ గా ఉంటేనే ఈ నూనెలు తాగాలి. అవి నార్మల్ గా లేకుంటే మీరు ఈ నూనెలు తాగకూడదు! ఇది గుర్తు పెట్టుకోండి.

ముఖ్య గమనిక: నూనె మొదట తాగి, తరువాత గంట అయ్యాక కషాయం తాగి, తరువాత, గంట అయ్యాక మాత్రమే మీ ఇంగ్లీష్ మందులు ఏవైనా వేసుకోవలసి ఉంటే వేసుకోవాలి, అప్పుడు ఉదయం టిఫిన్ తినాలి. ఇది పాటించకుండా ముందుగా ఇంగ్లీష్ మందులు వేసుకుంటే ఆ ఇంగ్లీష్ మందులు ఏమాత్రమూ పని చేయవు.

రోజంతా, రాగి పలక తో శుభ్రం చేసిన నీరు మాత్రమే వాడాలి. వంటకు, కషాయాలుకు, తాగేందుకు ఇలా అన్నిటికి అదే నీరు వాడాలి. ధాన్యం కడిగేందుకు కూడా అదే నీరు వాడాలి.

నువ్వుల లడ్డు

7 రోజులకు ఒక సారి నువ్వుల లడ్డు తినాలి. 50 గ్రాముల శుభ్రమైన నువ్వులు తీసుకుని, దోరగా వేయించి, వాటిని మిక్సీలో వేసి, 25 గ్రాముల తాటిబెల్లం ముక్కలుగా వేసి, గ్రైండ్ చేసి, దాన్ని లడ్డులాగా కట్టి కడుపులోకి తీసుకోవాలి. ఇది వారానికి ఒక్కసారి మాత్రమే.

సూర్య దర్శనం - ధ్యానం - నడక

ఉదయిస్తున్న మరియు అస్థమిస్తున్న సూర్యుణ్ణి చూడడం, తరువాత భగవంతుడిని ధ్యానం చేయడం, తరువాత నడవడం అనే ఈ మూడు ప్రక్రియలు అన్ని వ్యాధులకు చాలా చాలా ముఖ్యమైనవి, తప్పక చేయవలసినవి.

సూర్య దర్శనం అన్ని వ్యాధులకు తప్పనిసరి

ఉదయిస్తున్న సూర్యుడిలో, అస్తమిస్తున్న సూర్యుడిలో అద్భుతమైన కాషాయ వర్ణం ఒకటి మిళితమై ఉంటుంది. ఆ వర్ణాన్ని తదేకంగా మనం కళ్ళతో చూసినప్పుడు, ఆ రంగు కిరణాలు మన కంటిలోని రేటినా లోనికి ప్రవేశించి, అక్కడున్న "రాడ్స్ అండ్ కోన్స్" అనే "ఫోటో రిసెప్ట్టార్" కణాలను ఉత్తేజం చేసి దానిద్వారా మెదడులో కొన్ని అద్భుతమైన జీవరసాయన చర్యలను ట్రిగ్గర్ చేసి కొన్ని మంచి హార్మోన్స్ విడుదలకు దోహదపడుతుంది.

నడక అన్ని వ్యాధులకు తప్పనిసరి

ప్రతి రోజు సూర్యోదయ సమయంలో భార్య, భర్తలు కలిసి 75 నినిషాలపాటు ఆగకుండా నడవాలి. సాయంత్రం సూర్యాస్తమయం లో కూడా  75 నినిషాలపాటు ఆగకుండా నడవాలి. ఈ నడక దేహంలో మరియు మెదడులో పలు రకాల హార్మోన్ల విడుదలకు తోడ్పడుతుంది.

హెచ్చరిక: గుండె జబ్బులున్నవాళ్ళు, హై బీపీ ఉన్నవాళ్లు, తగు జాగ్రత్తలు తీసుకుని, నడవగలిగినంతనే నడవాలి.

ధ్యానం అన్ని వ్యాధులకు దివ్య ఔషధం

సకల చరాచర జగత్తుకు మూలభూతమై, సర్వత్రా తానై వ్యాపించిఉన్న ఆ భగవత్ శక్తిని, ప్రతిదినం ఉదయము మరియు సాయంత్రము ఒక్కోసారి 15 నిమిషాలపాటు ధ్యానిస్తూ, మన ఉఛ్వాస-నిస్వాసలను గమనిస్తూ ధ్యాన ముద్రలో ప్రశాంతంగా కూర్చుని ధ్యానం చేయాలని ఖాదర్ గారు చెప్తారు. గాఢమైన ధ్యాన స్థితిని అలవర్చుకోగలిగితే, ఒక చివరిదశలో థైరాయిడ్ గ్రంధి తనంతట తానే ఉత్తేజమై దేహమంత అద్భుతమైన హార్మోను రసాయనాలను నరనాడుల్లో చిలకరిస్తుంది. అందుకే అన్ని వ్యాధులకు ధ్యానం ఒక అతి అద్భుతమైన ఆయుధం!

పైన చెప్పిన విధానం పాటించడం మొదలు పెట్టాక, 2 నెలల తరువాత ఒకసారి మీ డాక్టర్ ను కలిసి పరీక్షలు చేయించుకోండి. వాళ్ళు మెల్లిగా మాత్రలు తగ్గిస్తూ వస్తారు.

మీరు వెంటనే మాంసాహారం, ఆల్కహాల్, సిగరెట్లు పూర్తిగా మానేయాలి. రోజువారీ ఆహారం తినడంలో సమయపాలన తప్పనిసరిగా పాటించాలి.

అలాగే ఈ క్రింద చెప్పిన నిషిద్ధ పదార్థాలు ఏవి ఇక తినకూడదు. లేదంటే, ఈ ఆహారవిధానం మీకు నిరూపయోగం, మా ఈ శ్రమ నిష్ప్రయోజనం!

నిషిద్ధ/తినకూడని పదార్థాలు:

1. బియ్యం
2. గోధుమలు, మైదా, అన్ని మైదా పదార్థాలు, అటుకులు, బొరుగులు (మరమరాలు), సెమియా, సగ్గుబియ్యం
3. చక్కర, బెల్లం కృత్రిమ ఉప్పు (టేబుల్ సాల్ట్)
4. పాలు, కాఫీ, టీ, బిస్కట్స్, చాకలెట్లు, బేకరీ ఐటమ్స్
5. అన్ని రకాల మాంసం, గ్రుడ్లు, చేపలు
6. రిఫైన్డ్ నూనెలు
7. అశుద్ధ నీరు
8. ప్లాస్టిక్, నాన్ స్టిక్ పాత్రల వాడకం

తినవలసిన పదార్థాలు:

1. పైన చెప్పిన సిరి ధాన్యాలు
2. పైన చెప్పిన కషాయలు
3. ఎద్దు గానుగ నూనెలు మాత్రమే తాగేందుకు, వంటలకు వాడాలి
4. దొరికితే నాటు ఆవు పాలుతో చేసిన పెరుగు, మజ్జిగ కొద్దిగా వాడాలి
5. సముద్రపు ఉప్పు అంటే రాళ్ళ ఉప్పు వాడాలి
6. రాగితో శుభ్రపరచిన నీరు మాత్రమే వంటకు, త్రాగేందుకు వాడాలి
7. అవసరం అయితే తీపి కోసం తాటిబెల్లం వాడాలి (డయాబెటిస్ పేషెంట్స్ తినకూడదు)
8. చేతికి అందే స్వచ్ఛమైన అన్ని ఫలాలు (డయాబెటిస్ పేషెంట్స్ పండ్లు తినకూడదు)

Dr. ఖాదర్ గారి జీవనవిధానమ్ పూర్తిగా ఆచరించండి. అప్పుడే ఇవన్నీ ఫలితాలు ఇస్తాయి.

Subscribe to get more Images :