Aug 31, 2019

What Are Millets Types Of Millets Their Health Benefits

సిరి ధాన్యాలు ఉపయోగాలు పద్ధతులు
What Are Millets Types Of Millets Their Health Benefits

లాటిన్ భాష లో క్యాన్సర్ పదానికి 'పీత కాళ్ళ లాగా వ్యాపించేది' అనే అర్ధం వస్తుంది. మానవ దేహం లో నిరంతరం గా కణ విభజన జరుగుతూ ఉంటుంది. ఈ విభజన పై దేహం లో సహజం గానే నియంత్రణ ఉంటుంది. ఒకొక్కప్పుడు నియంత్రణ పోయి కొన్ని కణాలు అసంఖ్యాకం గా విభజన చెంది వ్రణం గా, (ట్యూమర్ గా ) తయారవుతాయి. సాధారణంగా అంతా చెప్పేదేమిటంటే ఇలా నియంత్రణ లేని కణ విభజన కి కారణాలు ఏమి లేవని, ఉన్నా తెలియవని! కానీ సూక్ష్మం గా పరీక్షిస్తే, ఈ రోగం పుట్టుక గురించి కారణాలు తెలియ వస్తాయి.

1970 - 80 వ సంవత్సరం దాకా క్యాన్సర్ రోగం పెద్దగా కనిపించ లేదు . క్యాన్సర్ సోకిన రోగులూ చాల తక్కువగా ఉండే వారు. అప్పట్లో దాదాపు ఒక లక్ష ఉండవచ్చు. WHO ప్రపంచ ఆరోగ్య సంస్థ వెబ్ సైటు లో ప్రచురించిన గణాంకాలను చూస్తే, 2030 సంవత్సరం కల్లా దాదాపు 1.4 నుండి 2 కోట్ల ప్రజలు ఈ రోగానికి గురవుతారని వ్రాశారు. ఇందుకు కారణం, విషపూరితమైన వివిధ ఆహారాలను మనం ప్రతీ రోజూ భుజించడమే.

ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే - మనం అంతకు ముందు తిన్న ఆహారాలలో విషపదార్థాలు లేవనా? ఇప్పుడు ఇంత విషపూరితం గా ఆహారాలు ఎలా తయారయ్యాయి?

ప్రకృతి లో సహజం గానే విష పదార్థాలు చాల ఉన్నాయి. జంతువులలో ఉండే విషాలు- పాముల లో, తే)ళ్ల లో ; అలాగే మొక్క లలో- ఉమ్మెత్త మొదలైనవి- ఇవన్నీ కూడా క్రొవ్వు/నూనె లలోనే కరిగే లక్షణం కలిగి ఉన్నాయి. నీటిలో కరిగే లక్షణం లేదు కనుక ఈ జీవులు మరణించినా, వాతావరణానికి హాని కలిగేది కాదు.

పెరుగుతున్న జనాభా కి ఆహారాన్ని వృద్ధి చేయాలనే ఉద్దేశం తో రసాయనిక ఎరువుల వాడకం, వాటి ద్వారా ఉద్భవమైన మరిన్ని క్రిమికీటకాలు నుండి రక్షణకు అధికం గా క్రిమి, కీటక, శిలీన్ద్ర నాశని రసాయనాలు వాడటం మొదలైంది. ఈ రసాయనాలన్నీ 'ఏమల్షన్' (Emulsion ) రూపం లోనే ఉత్పత్తి అయేవి. కానీ శాస్త్రవేత్తలు నీటి లో కరిగే కలుపు, క్రిమి, కీటక, శిలీన్ద్ర నాశని రసాయనాలను చేయాలని పూనుకున్నారు. అమెరికా లో 'జన్యు పరం గా మార్పు చెందిన సోయాబీను' విత్తనం తయారయ్యాక ఈ అవసరం వారికి కలిగింది. సోయాబీను పంట లో కలుపును చంపేందుకు ఒక రసాయనాన్ని కనుగొన్నారు. కానీ అది పంట మొక్కలను కూడా చంపింది. ఈ 'కలుపు నాశని' 2-4-D (దీని నే 'ఏజెంటు ఆరంజ్' కానీ కూడా పిలుస్తారు). ఈ రసాయనాన్ని వియత్నాం యుద్ధం లో అమెరికా వారు అడవుల ఆకులు పూర్తిగా నాశనమయి రాలిపోయేందుకు కొన్ని లక్షల టన్నులు వాడారు. క్రమేణా ఈ రసాయనం కొద్దిగా నీటి లో కరిగే ఒక రకమైన 'ఫీనోలిక్' కాంపౌండ్ తయారవడానికి దారి తీసింది. దాని నుండి శాస్త్రవేత్తలు నీటి లో కరిగే 'గ్లై ఫోసేటు' వంటి కలుపు మందులను వృద్ధి చేసారు. ఈ విధం గా ఈ రసాయనాలు వాతావరణం లోకి రావటానికి ఆస్కారం ఏర్పడింది. నా ఉద్దేశ్యం లో 'పెద్ద ఎత్తున క్యాన్సర్ ల పుట్టుకకు' అప్పుడే బీజం పడింది.

నీటి లో కరిగే కలుపు మందుల ఉత్పత్తులు పెద్ద ఎత్తున జరగటం మొదలైంది. వీటి విష ప్రభావం ఎంత వరకూ వెళ్లిందంటే, దక్షిణ ధృవంలో ఉండే పెంగ్విన్ పక్షుల రక్తం లో కూడా ఈ రసాయాన్ని కనుగొన్నారు. అమెరికా లోని 70 శాతం ఇళ్లలోని త్రాగునీటి లోనూ ఈ రసాయనం కనిపించింది. అమెరికా తల్లుల రొమ్ము పాలలోనైతే - యూరోపు దేశాలలో నీటి లో అనుమతించబడిన హాని కారక రసాయన ప్రమాణాల కంటే 1600 రెట్లు ఎక్కువగా కనిపించింది. మగవారి మూత్రం లో కూడా ఈ రసాయనం ప్రత్యక్షమైంది. దీనిని క్యాన్సర్ల పెరుగుదలకు ఒక ముఖ్య కారణం గా చెప్పుకోవచ్చు. - 'జన్యుపరంగా మార్పు చెందిన పైర్ల పెంపకం' (సోయాబీను వంటివి) వలన 'గ్లై ఫోసేటు' అమ్మకాలు మరింత అధికంగా జరిగాయి.

శాస్త్రవేత్తలు ఒక రకమైన మొక్కజొన్నను కూడా తయారు చేశారు. అందులో 'క్రొవ్వు' పదార్థం ఎక్కువ.(సామాన్యం గా 1 మిల్లి గ్రామ్/100 గ్రాము లలో ఉంటుంది). ఈ మొక్కజొన్నని పశువులకు మేత గా వాడినప్పుడు, కోళ్లపెంపకపు మేత లో చేర్చినప్పుడు- ఈ నీటిలో కరిగే రసాయనాలు జంతు మాంసంలోకి రవేశించాయి.ఈ విధం గా, నీటిలో కరిగే ఈ విష పదార్థాలు పాల ఉత్పత్తులలో, ఎద్దు, పంది, కోళ్ల మాంసాలలో ప్రత్యక్షమయ్యాయి.
What Are Millets Types Of Millets Their Health Benefits
What Are Millets Types Of Millets Their Health Benefits

శాఖాహారు లు కూడా వీటి బారిన పడ్డారు. బేకరీ కర్మాగారాలు విరివి గా జంతు సంబంధమైన క్రొవ్వు పదార్థాలని వాడతాయి. ఈ క్రొవ్వును జంతు మాంసపు అదనపు ఉత్పత్తి గా కళేబరాల వ్యర్ధపదార్థాలనుండే చేస్తారు.

క్యాన్సర్ లు పెరగటానికి మరో కారణం ఎవరంటే, ఆహారం లో వాడే నూనె ల తయారీదారులు. పెట్రోలియం కర్మాగారాల్లో ముడి చమురు ను శుద్ధీకరణ చేసేటప్పుడు c-8 యూనిట్లు కంటే తక్కువ నాణ్యమైన 'మండే పదార్థాలు లేని' చమురులను కూడా ఉత్పత్తి చేస్తారు. కందెనలకూ, నాప్త మొదలైన వాటి ఉత్పత్తులకు వాడతారు. కానీ ఇటువంటి నూనె లకు కొన్ని రసాయనాలు చేర్చి, ఉడికించి, కొన్ని సహజ ఉత్పత్తుల వాసనలూ, రంగులూ వచ్చేలాగా కృత్రిమ రసాయనాలు చేర్చి నూనె గింజల ఉత్పత్తులలోనూ, ప్రొద్దుతిరుగుడు పూవు, కొబ్బరి నూనెల ఉత్పత్తి లోనూ వాడి- అమ్మకాలు మొదలు పెట్టారు. ఈ విధంగా విష పూరిత మైన రసాయనాలు అన్ని విధాలా మానవ జీర్ణ మండలం లోకి ప్రవేశించాయి.

మన ఆహారం లోకి ప్రవేశించిన ఈ విష పూరితమైన రసాయనాల గురించి అందరికీ తెలియచేయాలి, జాగరూకులను చేయాలి. ఆహార ఉత్పత్తులలో పద్ధతులు మారాలి. వ్యవసాయం, ఆహార ఉత్పత్తుల కర్మాగారాల లో రసాయనాల వాడకాలని నిషేధించాలి. లేదంటే ఇన్నిరకాల క్యాన్సర్ లూ, రోగాలూ నియంత్రించటం, చికిత్సలు అందించడం అసాధ్యమౌతుంది.

అధికం గా ఫైబర్ కలిగిన, సహజం గానే సేంద్రియం గా పెంచడానికి అనువైన, అతి తక్కువ నీటి తో పంటల నిచ్చే- 5 సిరి ధాన్యాలను (మిల్లెట్ లు -కొర్ర బియ్యం, అర్క బియ్యం, ఊదలు బియ్యం, సామెలు బియ్యం, అండు కొర్రలు బియ్యం-- 8 నుండి 12 .5 శాతం పీచు పదార్థం /FIBRE కలిగినవి, పూర్తిగా సేంద్రియ మైనవి.) ముఖ్య ఆహారం గా చేసుకోవటం ద్వారా మాత్రమే మనం ఈ నాటి అధునాతన లోకపు మహమ్మారి వంటి ఈ రోగాల నుండి కాపాడుకుంటూ ఆరోగ్యమైన జీవన శైలి పొందగలుగుతాం.

డాక్టర్ ఖాదర్ ఎవరు?

డాక్టర్ ఖాదర్ వలి తెలుగు వాడు, ప్రొద్దుటూరు లో ఒక సామాన్య కుటుంబం లో జన్మించిన వ్యక్తి. కానీ, అసాధారణ మైన 'జీవ రసాయన శాస్త్ర' సంబంధపు జ్ఞానం తో సహజ ప్రజ్ఞా వంతుడిగా జన్మించారు. బెంగళూరు లోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ అఫ్ సైన్సెస్ లో 'స్టెరాయిడ్స్' మీద PhD పూర్తి చేసి అమెరికా లో పదేళ్ళపాటు శాస్త్రజ్ఞుడిగా అతి పెద్ద కంపెనీ లో పని చేసారు.
కానీ ఆధునిక మానవ సమాజం- తినకూడని ఆహారాలు తింటూ, నేడు దారుణ మైన రోగాల పాలు కావటం తో పాటు, భూమాత ను రసాయనిక వ్యవసాయం తో నాశనం చేసుకుంటూ ఉండటం చూసి చలించి పోయి, 'నా దేశం, నా భూమి, నా ప్రజలూ' అనుకుంటూ లక్షల, కోట్ల సంపాదన ను విడిచి పెట్టి అమెరికా వదిలి తిరిగి భారత దేశానికి 1997 లో వచ్చేసారు డా.ఖాదర్.

ఆలోచించండి !!
మధుమేహ రోగులు

ఏ వైద్య విధానం అవలంబించినా, ముఖ్య విషయం ఏమిటంటే , మనం ఎటువంటి ముఖ్యాహారం తింటున్నాం...అందులో ఎంత శాతం ఫైబర్ లేదా పీచు పదార్ధం ఉందీ అని.
ఎందుకంటే మన ఆహార ధాన్యాలలో ఇమిడి ఉన్న పీచు పదార్ధమే జీర్ణమైన ఆహారం నుండి మన రక్తం లోకి గ్లూకోజు వచ్చి పడటాన్ని నియంత్రిస్తుంది.

మరి ఈ నాటి వరి అన్నం, గోధుమ లలో పీచు పదార్ధం 0.2 నుండి 0.5 మాత్రమే అని తెలిసీ, మైదా లో నైతే శూన్యం అనీ తెలిసి, మూడు పూటలా వాటినే రకరకాల వంటల పేర్లతో ఆరగిస్తూ , ప్రతీ 100 గ్రాముల నుండీ 70 గ్రాముల గ్లూకోజు కుమ్మరిస్తామా?
లేదా
పీచు పదార్ధం తగినంత కలిగి ఉండి చక్కగా గ్లూకోజు విడుదలని మెల్ల మెల్లగా ఆహారం భుజించాక 5 నుండి 7 గంటల పాటు కొద్ది కొద్ది గా విడుదల చేస్తూ నియంత్రించే 5 పంచరత్న 'సిరి ధాన్యాలని' మన ముఖ్య ఆహారంగా చేసుకుంటామా?

మన దేహం లో ఉండేది 4 నుండి 5 లీటర్ ల రక్తం. మొత్తం మీద మన దేహం లో మామూలు పరిస్థితుల్లో ఉండేది 6 నుండి 7 గ్రాముల గ్లూకోజు మాత్రమే. మరి రోగుల రక్తం లో షుగరు లేదా గ్లుకోజు లెవెల్స్ ఇలా పెరిగి పొతే, పాడయ్యేవి- మన రెటీనా, మూత్ర పిండాలు, నాడీ వ్యవస్థ, మెదడు, ఇంకా మన పునరుత్పత్తి మండలం. కాల క్రమేణా ఈ అంగాల లో కూడా, నయం కానీ దీర్ఘ రోగాల్ని తెచ్చి పెడ్తుంది ఇటువంటి ఫైబర్-లేని ఆహారం. అందుకే మనం తెలివిగా వ్యవహరించాలి. మన రోగాలు పెంచే ఆహారాలు దూరం పెట్టాలి. మన రోగాలను నయం చేసి మనల్ని కాపాడే ఆహార ధాన్యాలను ఆహ్వానించాలి.

ఈ 'సిరిధాన్యాలకు' మన దేహం లోని వివిధ అంగాల పై ప్రభావం చూపి స్వస్థత చేకూర్చే గుణాలు కూడా ఉండటం ఎంత ఆనందకరం? Yes, ప్రతీ మిల్లెట్ ధాన్యానికి మన లోని కొన్ని ప్రత్యేక అంగాల మీద ప్రభావం చూపగలిగే లక్షణం ఉంది. తద్వారా సంపూర&#31#3149;ణ ఆరోగ్యం వీలవుతుంది.

విస్మరించ లేని మరో ముఖ్య విషయం ఏమిటంటే, ఈ గ్లూకోజు విడుద ల వ్యవస్థ ఈ రోజు మనల్ని 'LifeStyle రోగాల' పేరు తో బాధ పెడ్తున్న ప్రతీ రోగానికి ముడిపడి ఉంది. ఈ నాటి ఫైబర్ లేని లేదా అతి తక్కువ గల ఆహారం - మధుమేహం, PCo d, థైరాయిడ్, కీళ్ల నొప్పుల దగ్గర నుండి, క్యాన్సర్ ల వరకూ ప్రతీ రోగానికి కారకమౌతోంది .

రోజు కి 38 గ్రాముల 'ఆహారంలోని ఫైబర్' ప్రతీ మానవుడికి అవసరం అన్న శాస్త్రీయ రికమండేషన్/సిఫారసు ఎలా ప్రక్కన పెడతాం? అది లేకుండా ఆరోగ్యాన్ని పొంద గలమన్న ధీమా ఎలా చూపగలం?

అందుకే పోలిష్ చేయని 'సిరిధాన్యాలు' మానవాళికి వరాలు.

అందుకే మీరు 'సిరి ధాన్యాలను' నేడే మీ జీవితాల్లోకి ఆహ్వానించండి

కొర్ర బియ్యం- Foxtail Millet (Korra Biyyam/Kangni),
సామెలు బియ్యం- Little Millet (Saamelu Biyyam/Kutki),
అరికెల బియ్యం -Kodo Millet(Arikalu Biyyam/Kodra),
ఊదలు బియ్యం -Barnyard Millet (Oodalu Biyyam/Jhingora),
అండు కొర్రలు బియ్యం- Browntop Millet(Andu Korralu)

ఈ పంచ రత్న సిరిధాన్యాలు అన్నిటి లోనూ 8 నుండి 12.5% ఫైబర్ ఉంది . సిరి ధాన్యాల తో అన్ని వంటకాలు చేసుకోవచ్చు. పోలిష్ చేయని సిరి ధాన్య మిల్లెట్ ల ను 5 - 6 గంటల పాటు నాన పెట్టడం ద్వారా ఉత్తమ ఫలితాలు పొందుతారు. రాత్రి నాన పెట్టి ఉదయాన్నే వండండి. మధ్యాహ్నం నాన పెట్టి రాత్రి వండండి.

సిరి ధాన్య మిల్లెట్ లతో అన్నం, రొట్టె, పొంగలి, ఉప్మా, ఇడ్లీ, దోశ, బిరియాని - అన్నీ చేసుకోవచ్చు.

మైసూరు లో స్థిర నివాసం ఏర్పరచుకొని గత రెండు దశాబ్దాలుగా మన ఆహారవ్యవస్థ, ఆరోగ్యం, వ్యాధులు, హోమియోపతి ల మీద పరిశోధనలు చేస్తూ పురాతన భారతీయ ప్రక్రుతి సేద్య పద్దతి ఐన 'అటవీ కృషి' (కాడు కృషి) కి రూపకల్పన చేసారు. ఈ పద్దతి ద్వారా వేల మంది రైతులు ఈ రోజు ఏ రసాయనాలు లేకుండా వ్యవసాయం లో లాభాలు చూస్తున్నారు. 2009 నుంచి స్వయం గా ఏడెకరాల భూమి లో కొర్రలు, అండు కొర్రలు, సామెలు, ఊదలు, అరికలు వంటి 5 పురాతన మిల్లెట్ లను పండిస్తూ, ఈ పంటల ధాన్యపు ఆహారాన్ని సేవించటం ద్వారా ఎలా పలు వ్యాధులను అరికట్టవచ్చొ గమనించారు. ఎకరానికి 'కాడు కృషి' పద్దతి లో 10 క్విన్టాలు సాధించటం ఎలాగో ఎంతో మంది రైతులకు శిక్షణ నిచ్చారు.

చక్కర వ్యాధి (డయాబెటీస్) తో బాధ పడే వారికి, అధిక రక్త పోటు (హై బీపీ), ఊబకాయం, మల బద్దకం, పైల్స్ , మొలలు, గ్యాంగ్రిను, ట్రయి గ్లిసెరైడ్స్, PCOd, అతి తక్కువ వీర్య కణాలు, చర్మ వ్యాధులు, మూత్రపిండాలు,థైరాయిడ్, రక్త ఇంకా హృదయ సంబంధమైన, మెదడుకు సంబంధించిన వ్యాధుల తో బాధ పడే వారికి, క్యాన్సర్ వంటి మహమ్మారి రోగాలకు కూడా సరైన ముఖ్య ఆహార ధాన్యాలు- 'సిరి ధాన్యాలు' మాత్రమేనని, ఆహారంలో మార్పుల ద్వారానే, అనేక వ్యాధుల నియంత్రణ ఇంకా నిర్మూలన ఎలా సాధ్యమో అందరికీ చాటి చెప్పారు. దీర్ఘ కాలిక జబ్బులే కాక, రైతుల ఆత్మహత్య లు ఆపే 'వజ్రాయుధం' కూడా 'సిరి ధాన్యాలే' అని ఉద్భోధించారు.

అందులో భాగం గానే కర్ణాటక రాష్ట్రం లోని పల్లె పల్లె కీ, పట్నాలకూ తిరిగి 1000 కి పైగా ఉపన్యాసాలు ఇఛ్చి డాక్టర్లకూ, విద్యార్థులకూ, MLA ల కూ , ఎంపీ లకూ, గృహిణులకూ, పిల్లల కూ , పెద్దలకూ, పరిశోధన ల్యాబ్ లలో, యూనివర్సిటీ లలో, కాలేజీ లలో ఈ సిరి ధాన్యాల సందేశాన్ని ఎలుగెత్తి ప్రకటించారు.

అండు కొర్రల తపిలెంటు

అండు కొర్రల పిండి....2 కప్పులు
వేరుశెనగ గింజల పొడి..1/4కప్పు.
నూగులు....15 gm
జిలకర్ర.....15gm
ఆనియన్....2 పెద్దవి
క్యారెట్....1 పెద్దది
కొత్తి మీరా.... కొద్దిగా
పచ్చిమిర్చి...15
ఉప్పు....తగినంత.
పచ్చిమిర్చి,ఉప్పు పేస్ట్ చేసుకోవాలి.
(ఇంకా ఏదయినా ఆకుకూర కానీ,సొరకాయ తురుము కానీ వేసుకోవచ్చు.)

ఆనియన్ కట్ చేసుకొని, క్యారెట్ తురుము,పైన చెపిన్నవి అన్ని బాగా కలుపుకొని తగినన్ని నీళ్లు పోస్తూ కలుపుకోవాలి. కలిపిన పిండిని చిన్న బిల్లలుగా వత్తుకోవాలి. పెన్నాం లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడిఎక్కిన తరువాత వీటిని పెన్నం లో వేసుకొని ,పెన్నం ను పట్టుకొని ఒకసారి తిప్పుకోవాలి, ఆయిల్ అన్నిటికి అంటుకుంటుంది.పెన్నం పైన వాటర్ ఉన్న మూత పెట్టుకోవాలి. మంట సిమ్ లో ఉంచుకొని కాల్చుకోవాలి.

ఇలా ఏ సిరిధాన్యాల పిండితో అయినా చేసుకోవచ్చు.

మట్టి పెన్నం లేని వాళ్ళు మంద పాటి ఇనుప పెన్నం వాడుకోవచ్చు.

1. నీరు - రాగి బిందెలో కాని రాగి రేకుతో కాని శుద్ధి చేసిన నీటిని తీసుకోవాలి (6 గంటలు నీళ్ల బిందె లో రాగి రేకు ఉంచాలి)

2. పాలు కోసం - నువ్వులు, కొబ్బరి, సజ్జలు, రాగులు జొన్నలు, కుసుమ వేరుశనగల నుండి తీసుకోవాలి (6 గంటలు నాన పెట్టి అదే నీటితో రుబ్బు కొని కాటన్ క్లాత్ లో ఫిల్టర్ చేయాలి)
ఈపాల గిన్నెను ఇంకొ వేడినీటి గిన్నెలో పెట్టి వేడిచేసుకొని పెరుగు చేసుకోవచ్చు.

నాటు ఆవు పాలతో పెరుగు, మజ్జిగ, నెయ్యి చేసుకొని వాడుకోవచ్చు. ఆవు పాలు నేరుగా తాగకూడదు.

3. తీపి కోసం - తాటి బెల్లం, ఈత బెల్లం వాడు కోవాలీ (బెల్లం తడి చేసుకుని లేత పాకం చేసుకుని వాడుకోవచ్చు)

4. నూనె కోసం - వేరుశనగ, నువ్వులు, కొబ్బరి, కుసుమ గింజలు, (చెక్క గానుగ నుండి తీసుకోవాలి)

5. కాఫీ, టీ, నాన్ వెజ్, వరి బియ్యం, గోధుమలు, A1(జెర్సీ) పాలు, గుడ్లు, మైదా, చక్కెర, ప్యాకేజ్డ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ మానేయాలి.

6. సిరి ధాన్యాల తో అన్ని రకాలు అనగా పులిహోర, కిచిడి, రొట్టెలు, ఇడ్లీ, దోశ, పిండి వంటకాలు etc ఆకు కూరలు, కూరగాయల తో తీసుకోవచ్చు.

7. అలాగే తాజా ఆకులతో కషాయం తీసుకోవాలి. (చిన్న ఆకులు గుప్పెడు, పెద్దవి 4, 5 తీసుకొని నీటిలో 3,4 నిమిషాలు మరిగించుకొని, వడబోసుకొని తాగాలి.)

8. మట్టి లేక స్టీలు పాత్రలలో వండుకోవాలి. దోస, చపాతీ చేసుకొనుటకు ఇనుప పెనం వాడుకోవచ్చు.

9. ఒకగంట నడవాలి.

10. 10,15 నిమిషాలు ధ్యానం చేయాలి.

వంట నూనె స్కామ్

సన్ ఫ్లవర్ 30-40 సంవత్సరాల క్రితం పండించే వారే కాదు*

అసలు మన భారత్ దేశం లో 40 యేళ్ళ కిందట సన్ ఫ్లవర్ నూనె లేదు పంట లేదు.

మన ఆహార ధాన్యం నూనె ధాన్యం కానే కాదు

ఆరోగ్యానికి హానికరం మన భరత దేశం లో తక్కువ నే పండిస్తారు*

మరి ప్రతి నెలా ఇన్ని లక్షల లీటర్ల సన్ ఫ్లవర్ నూనె ఎలా వస్తుంది ??

సన్ ఫ్లవర్ నూనె పాకెట్ లో కేవలం 10-15% సన్ ఫ్లవర్ నూనె ఉంటుంది (అది కూడా ఆరోగ్యానికి హానికరం)

మిగితా 60% ప్యరాఫీన్ ఆయల్ ( క్రుఢ్ లో డీజిల్ పెట్రోల్ తీసిన తరువాత నీరు లాంటి ప్యరాఫిన్ ఆయల్ బయట వస్తుంది

దీనికి వంట నూనె లా ఉపయోగిస్తే హార్ట్ ప్రోస్టేట్, రొమ్ము క్యాన్సర్ , షుగర్ వ్యాధులు వస్తాయి ఈ నూనె చాల ప్రమాదకరం)

మిగతా 30% శాతం పామాయల్ ఉంటాయి పాo ఆయల్ తినే నూనె కాదు హార్ట్ మరియు నరాల వ్యాధులు వస్తాయి పురాతన కాలం లో ఎవ్వరూ ఉపయోగించలేరు

అసలు 30 సంవత్సరాల కింద ఈ పామాయల్ ఉనికే లేదు !

ఈ కల్తీ నూనెలకు తోడూ ప్లాస్టిక్ ప్యాకెట్లు ..ప్లాస్టిక్ లో BPA (బిస్ ఫినాల్ A) ఇంకా pthalate అనె అతి విషకరమైన కెమికల్స్ నూనె లో కలుస్తాయి వీటి వలన మగవాళ్ల లో వీర్యకణాలు విర్యోత్పత్తి తగ్గి పోయి నపుంసకులు గా మారుతున్నారు..!


కల్తీ నూనెలు నుంచి కాపాడుకునే మార్గాలు :-

1) వేరు శనిగలు, నువ్వులు కుసుమలు లాంటి నూనె ధాన్యాలు కొని ఆయిల్ మిల్ లో మన కళ్ల ముందే పట్టించాలి

2) నూనెను ప్లాస్టిక్ కంటేనర్ లో వేస్తె ప్లాస్టిక్ లో ఉన్న విష కెమికల్స్ నూనె లో కలిసి పోతాయి కాబట్టి నూనె స్టార్ చెయ్యడానికి స్టీల్ కంటేనరే వాడాలి

3) ఇలా మనం సొంత నూనె తాయారు చేసుకుంటే భారత దేశం లో 80-90% హార్ట్ వ్యాధులు మాయం అవుతాయి కీళ్ల నొప్పులు సర్జరీలు బంద్ ..సూపర్ స్పెషాలిటీ హార్ట్ ఆసుపత్రిలు మూసి పోతాయి !

సిరిధాన్యాల పిండి ,నూకలు చేసుకొనే విదానం

1. ఒకొక్క సిరిధాన్యం ను వేరువేరుగా 6 నుండి 8 గంటకు నాన పెట్టుకొని ,వడబోసుకొని ఎండకు 2 రోజులు అరపెట్టుకొని వీటిని మరకు తీసుకొని వెళ్లి పిండి,నూక గా చేసుకోవాలి.

2. నూక మనం ఇంట్లోనే మిక్సీ కివేసుకోవచ్చు ,తిరగలి తో ఇసురుకోవచ్చు.

3. ఈ పిండి ఉపయోగించి ఇంస్టైంట్ దోశలు,రోటీలు,తపిలెంటు, జావా,సంకటి ,బజ్జిలు ,పకోడాలు ,జంతికలు etc., చేసుకోవచ్చు.

4. నూకలు తో జావా,ఉప్మాలు,కిచిడీలు, హల్వాలు,ఇడ్లిలు, etc., చేసుకోవచ్చు.

ముఖ్య గమనిక

5. మనం నాన పెట్టుకున్న నీటి తోనే వంటలు చేసుకోమని అంటారు ఖాదర్ సర్. ఇలా పిండి కోసం నాన పెట్టుకున్న నీటి ని కూడా వెస్ట్ కాకుండా ఆ నీటి తో ఆరోజు చేసుకొనే సాంబార్,రసం ,పప్పు కు వాడుకోండి.

6. అందుకు నాన పెట్టుకోడానికి ఎక్కువ నీరు వాడకుండా మునిగే వరకు వేసుకోండి.

7. నీరు వెస్ట్ కాకూడదు కావునా రోజుకు ఒకటి లేదా రెండు సిరిధాన్యాల ను నాన పెట్టుకున్న సరిపోతుంది.

8. మినప్పప్పు ను పొడి బట్టతో తుడుచుకుని పిండి చేసుకోండి.

9. సిరిధాన్యాల పిండి తో మినపప్పు పిండి కలుపుకొని దోసలు, మురుకుల వంటి కొన్ని వంటలు చేసుకోవటానికి వీలవుతుంది.

10. మనం ముందే నాన పెట్టుకున్నాము కావున సమయాభావం ఉన్నప్పుడు వీటిని మళ్ళీ నానపెట్ట కుండా కూడా వాడుకోవచ్చు. మళ్ళీ నానపెట్టినా మంచిదే.


Subscribe to get more Images :