Mar 13, 2024

Eating Tulasi Leaves to Get Good Sleep

 తులసి రసంతో నిద్రలేమికి చెక్ 

నేటి బిజీ లైఫ్‌లో నిద్రలేమి సమస్య చాలామందిని పీడిస్తుంటుంది. నిద్రలేమితో బాధపడేవారికి తులసి గొప్ప ఔషధం. అడవి తులసి రసాన్ని పంచదారతో కలిపి ప్రతిరోజూ రాత్రి పడుకోబోయే ముందు రెండు చెంచాలు తాగితే చక్కగా నిద్రపడుతుంది. 

నిద్రలేమితో బాధపడుతుంటే ఒక గ్లాసు వేడిపాలలో మూడు టీస్పూన్ల తేనె కలిపి తాగాలి. 

నిద్రలేమితో బాధపడుతుంటే పడుకోబోయే ముందు పదిహేను నిమిషాలసేపు పాదాలను, అరిపాదాలను నెయ్యి లేదా ఆముదంతో మర్ధన చేయాలి. 


నిద్రలేమి శరీరంలో హార్మోన్ల మీద ప్రభావం చూపుతుంది. హార్మోన్ల స్ధాయుల్లో హెచ్చుతగ్గులతో పాటు మెటబాలిజమ్‌ వేగం తగ్గుతుంది. మంచి నిద్ర కణాల పుననిర్మాణాన్ని, బాడీ మెటబాలిజాన్ని మెరుగుపరుస్తుంది. కాబట్టి రోజుకు ఎనిమిది గంటల నిద్ర తప్పనిసరి. 

నిమ్మరసంలో జీలకర్ర నానేసి వరుసగా ఏడు రోజులపాటు, రోజూ ఉదయం కొంచెం తింటుంటే పైత్యం తగ్గుతుంది. 


నీటిలో మెంతులు వేసి చేసిన టీ తాగితే కడుపులో మంట తగ్గుతుంది. 

నీళ్ళలో తులసి ఆకులు వేసి రాత్రంతా అలా ఉంచి ఉదయాన్నే పరగడుపున తాగితే జీర్ణక్రియకు సంబంధించిన అనేక సమస్యలు సమసిపోతాయి. 

నువ్వుల నూనె లేదా ఆముదంలో వెల్లుల్లి రేకలు వేసి ఐదు నిమిషాల సేపు సన్నని మంటమీద మరిగించాలి. ఈ నూనెతో వెన్నుకు మర్దనా చేయాలి. వీటికి బదులుగా ఏదైనా వంటనూనెను కూడా వాడవచ్చు. 

నులిపురుగుల సమస్య నుంచి విముక్తి పొందాలంటే టీస్పూను వాము, టీ స్పూను ఆముదం కలిపి రోజుకి రెండుసార్లు తీసుకోవాలి. 

నోటిపూత బాధిస్తుంటే మాచికాయను నూరి నీటిలో కలిపి ఆ మిశ్రమంతో పుక్కిలించాలి. ఇలా రోజుకు మూడుసార్లు చేస్తుంటే రెండు రోజులకు పూత పూర్తిగా తగ్గుతుంది.



Subscribe to get more Images :