April 24, 2013

Vijay Kumar

స్టార్స్ హనీమూన్ ట్రిప్...హాట్ స్పాట్స్


కేన్స్ - అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్

మా హనీమూన్ ట్రిప్ యూరప్‌లో జరిగింది. పెళ్లయిన వెంటనే కేన్స్ ఫిలిం ఫెస్టివల్ వెళ్లాల్సి వచ్చింది. పనిలో పనిగా అక్కడే హనీమూన్ చేసుకుంటే బావుంటుంది కదా! అని అభీ అంటే సరే అన్నాను. ఇద్దరం మార్టిన్జ్ అనే హోటల్‌లో దిగాం. గది తలుపులు తీస్తూనే సముద్రం కనిపిస్తుంది. ముంబయిలో ఉన్నప్పుడు సినిమాలు, ఫంక్షన్లు, కుటుంబం, షాపింగ్‌లతో తీవ్ర ఒత్తిడికి గురయ్యేదాన్ని. హనీమూన్ వెళ్లాక సెల్‌ఫోన్లు పక్కన పడేసి ఇద్దరం ముచ్చట్లు పెట్టుకునేవాళ్లం. హోటల్‌కు వెళ్లి నచ్చిన డిషెస్‌ను తినడం, షాపింగ్ చేయడం, బీచ్‌లలో హాయిగా తిరగడం మేమెప్పటికీ మరిచి పోలేము.


బహామాస్ - శిల్పాశెట్టి, రాజ్‌కుంద్రా

మాకు 2009 నవంబర్‌లో పెళ్లయింది. మా ఆయన లండన్‌లో వ్యాపారవేత్త. ముంబయిలో రిసెప్షన్ అయ్యాక హనీమూన్ ట్రిప్ ఎక్కడికి వెళితే బావుంటుంది? అని మాట్లాడుకున్నాం. ఇద్దరికీ బహామాస్ నచ్చింది. వెంటనే ఆయన ఫ్లయిట్ టికెట్లు బుక్ చేశాడు. సెలబ్రిటీలు దిగే 'అట్లాంటిస్ బహామాస్ రిసార్ట్'లో సూట్ తీసుకున్నాం. ఆ దేశం ఎందుకు వెళ్లామంటే అక్కడ కాసినోస్ ఉన్నాయి. అందులో తాగొచ్చు. తినొచ్చు. ఆడుకోవచ్చు. బోలెడంత కాలక్షేపం దొరికింది. ట్రిప్‌లో హైలైట్ ఏంటంటే అండర్‌వాటర్‌లో ప్రయాణించడం. రాజ్‌తో నాకు కొంత కాలంగా పరిచయమున్నా హనీమూన్ వెళ్లినప్పుడు తనలో కొత్త మనిషిని చూశాను. ఇద్దరి మనసులను మరింత దగ్గర చేసింది ఆ ట్రిప్.


కరీబియన్ దీవులు - విద్యాబాలన్, సిద్దార్థ రాయ్ కపూర్

మా పెళ్లికి ముందు, తర్వాత మీడియాను తప్పించుకుని తిరగడమే సరిపోయింది. యూ టీవీ అధినేత సిద్దార్థ రాయ్‌తో నా పెళ్లయిన సంగతి మీకు తెలిసిందే! మ్యారేజ్ అయిన మరుసటి రోజు నుంచే మా హనీమూన్ ట్రిప్పు గురించి పత్రికలు తెగ రాసేశాయి. వాళ్లకు ఎందుకంత ఆసక్తో మాకు అర్థం కాలేదు. ఈ తలనొప్పులు పడలేక.. మేము కరీబియన్ ఐలాండ్స్ వెళ్లొచ్చాము. కరీబియన్ సముద్రంలో
అక్కడక్కడ ఒకదానికొకటి అతుక్కుని ఉండే దీవులవి. ఎటు చూసినా నీళ్లు. సముద్రపు హోరు. బోట్లలోనే ఎక్కువ దూరం ప్రయాణించే అవకాశం చిక్కింది. విలాస నౌక (క్రూయిజ్)లలోనూ తిరిగాం. ఒకర్నొకరు అర్థం చేసుకోవడానికి హనీమూన్‌ను మించిన సమయం మరొకటి ఉండదు.

స్విట్జర్లాండ్ - కరీనాకపూర్, సయిఫ్ అలీఖాన్ 

మేము ఎక్కడికి వెళ్లినా అందరి కళ్లూ మా మీదే ఉండేవి. పెళ్లికి ముందు ఎన్ని ఇబ్బందులు పడ్డామో చెప్పలేము. అందుకే, వివాహం జరిగాక.. అందరికీ దూరంగా పారిపోవాలనిపించింది. ఇద్దరం కూడా ఏ పెద్ద సిటీకో వెళ్లాలనుకోలేదు. అత్యాధునిక సౌకర్యాలు కలిగిన ఓ పల్లెటూరికి వెళ్లాలనుకున్నాం. అందుకే, స్విట్జర్లాండ్‌లోని 'స్టాడ్' అనే పల్లె మా హనీమూన్ ట్రిప్‌కు వేదికైంది. సానెన్ మున్సిపాలిటీలో మూడువేల జనాభా కలిగిన గ్రామం అది. సముద్ర మట్టానికి వెయ్యి మీటర్ల ఎత్తులో ఉంటుంది. అక్కడున్నంత ప్రశాంతత మరెక్కడా లేదు. బాగా ఎంజాయ్ చేశాము.

Subscribe to get more Posts :